Health News: నైట్ టైమ్ ఐస్ క్రీమ్ తింటున్నారా..? అయితే జాగ్రత్త..! హాని తప్పదు..

నైట్ రైడ్‌కి వెళ్లి ఐస్‌క్రీమ్ తినడానికి ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. మీరు కూడా ఇలాంటివి ఎంజాయ్‌ చేసే ఉంటారు. కానీ, కొందరికి రాత్రిళ్లు పదే పదే ఐస్ క్రీమ్ తినే అలవాటు ఉంటుంది. అయితే ఇది ఖచ్చితంగా ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రిపూట ఐస్ క్రీమ్ తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో చూడండి.

Health News: నైట్ టైమ్ ఐస్ క్రీమ్ తింటున్నారా..? అయితే జాగ్రత్త..! హాని తప్పదు..
Ice Cream
Follow us
Jyothi Gadda

|

Updated on: May 23, 2024 | 6:09 PM

రాత్రిపూట రొమాంటిక్ రైడ్‌కి వెళ్లి, ఐస్‌క్రీం తినేవారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు ఐస్ క్రీం తినడం చాలా సరదాగా ఉంటుంది. అయితే మీ ఈ రొమాంటిక్ అనుభవం మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని గుర్తుంచుకోండి. ఎందుకంటే రాత్రిపూట ఐస్ క్రీమ్ తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రాత్రిపూట ఐస్ క్రీమ్ తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

ఐస్‌క్రీమ్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట ఐస్ క్రీం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాత్రి డిన్నర్‌ తర్వాత ఐస్ క్రీమ్ తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా విపరీతంగా బరువు పెరిగి, ఊబకాయం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు..ఐస్ క్రీమ్‌లో కెలరీలు ఎక్కువగా ఉంటాయి. చక్కెర, కొవ్వు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మన బరువు పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాగే హార్మోన్లను నియంత్రించే సామర్థ్యం కోల్పోయేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు, నైట్‌ టైమ్‌ ఐస్‌క్రీమ్‌ తినడం వల్ల నిద్ర లేమి సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం లాంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అందువలన రాత్రి సమయంలో అస్సలే ఐస్ క్రీమ్ తినకూడదని నిపుణులు సూచిస్తు్న్నారు. ఒక వేళ మీకు నైట్ టైమ్ స్వీట్ తినాలనిపిస్తే తేనే, స్వీట్ ఫ్రూట్స్, డార్క్ చాక్లెట్ మొదలైన వంటి వాటిని తీసుకోవాలని చెబుతున్నారు.పండ్లు, పెరుగుతో చేసిన ఫ్రూట్ స్మూతీస్ తినండి. దీని వలన ఆరోగ్యం బాగుండటమే కాకుండా , అతి బరువు, ఊబకాయం నుంచి తప్పించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..