AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్ స్పెషల్.. మీ పిల్లల హైట్ పెరగాలా? అయితే దీనికి హెల్దీ యోగాసనాలు ఇవే!

లవు రోజుల్లో పిల్లలలో శారీరక శ్రమ గణనీయంగా తగ్గుతుంది. బయటకు వెళ్లి ఆడుకోవడం, గెంతడం మానేస్తారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రత కూడా మరింత కారణంగా మారుతుంది. అయితే ఇలా పిల్లలు ఇంట్లో ఉండటం ఆరోగ్యానికి హానికరం. అటువంటి పరిస్థితిలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఒక గొప్ప పరిష్కారం. యోగా మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. పిల్లల దినచర్యలో కూడా యోగా ఒక ముఖ్యమైన అలవాటుగా మార్చండి. యోగాలో అనేక భంగిమలు ఉన్నాయి.

సమ్మర్ స్పెషల్.. మీ పిల్లల హైట్ పెరగాలా? అయితే దీనికి హెల్దీ యోగాసనాలు ఇవే!
Yoga Asanas For KidsImage Credit source: Getty Images
Surya Kala
|

Updated on: May 23, 2024 | 5:30 PM

Share

వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కువగా ఇంటి వద్ద తమ కుటుంబ సభ్యులతో లేదా బంధువులతో తమ సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా వేసవి సెలవులు వస్తే చాలు పిల్లలు అమ్మమ్మ ఇంటికి వెళ్లడానికి ఆసక్తిని చూపిస్తారు. అమ్మమ్మ ఇంటి వద్ద సెలవులను ఆస్వాదించడం సర్వసాధారణం. రాకరాక వచ్చిన మనవులకు చిన్న పని కూడా చెప్పారు అమ్మమ్మతాత. దీనికి తోడు ఇప్పుడు మొబైల్స్ లేదా గాడ్జెట్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సెలవు రోజుల్లో పిల్లలలో శారీరక శ్రమ గణనీయంగా తగ్గుతుంది. బయటకు వెళ్లి ఆడుకోవడం, గెంతడం మానేస్తారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రత కూడా మరింత కారణంగా మారుతుంది. అయితే ఇలా పిల్లలు ఇంట్లో ఉండటం ఆరోగ్యానికి హానికరం. అటువంటి పరిస్థితిలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఒక గొప్ప పరిష్కారం.

యోగా మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. పిల్లల దినచర్యలో కూడా యోగా ఒక ముఖ్యమైన అలవాటుగా మార్చండి. యోగాలో అనేక భంగిమలు ఉన్నాయి. వేసవిలో పిల్లల శారీరక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడే ఐదు యోగా ఆసనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

తాడాసనం పర్వత భంగిమ పిల్లల వెన్నెముకను నిటారుగా ఉంచుతుంది. తద్వారా పిల్లలు ఎక్కువసేపు నిలబడగలడు. శారీరక సామర్థ్యం ఏకాగ్రతను అభివృద్ధి చేసే సమతుల్యతను, స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. తాడాసనం కండరాలు, కాళ్లు, తుంటి ఎముకలను బలోపేతం చేస్తుంది. శరీరం ఎదుగుదలను సృష్టిస్తుంది. ఈ ఆసనం అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే పిల్లల ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది. పిల్లలలో మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

ధనురాసనం ఈ యోగాసనం వెన్నెముకను బలపరుస్తుంది. శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది. ధనురాసనం కడుపులోని అవయవాలు చురుకుగా ఉండేలా చేస్తుంది. దీంతో మలబద్ధకం లేకుండా చేస్తుంది. అంతేకాదు అజీర్ణ సమస్య నుంచి ఉపశమనం ఇస్తుంది. కండరాలను సడలించడమే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ధనురాసనం ఒత్తిడి, ఆందోళనను తగ్గించడం ద్వారా పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఊబకాయంతో బాధపడే వారు ఆరోగ్యంగా ఉండేందుకు ధనురాసనం సహాయపడుతుంది.

చక్రాసనం వీల్ పోజ్ అని పిలువబడే ఈ భంగిమ పిల్లల చేతులు, కాళ్ళ నొప్పిని తగ్గించడమే కాకుండా వాటిని బలంగా చేస్తుంది. ఇది భుజాలు, వెన్నెముకలోని ఇబ్బండులను తొలగిస్తుంది. ఈ ఆసనం చేయడం ఊపిరితిత్తులు తెరవబదతావు. ఊపిరితిత్తులకు ప్రయోజనం చేకూర్చడం ద్వారా శ్వాస వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

వృక్షాసనం పిల్లలు ఈ యోగా ఆసనాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే, ఇది కాళ్ళలో సమతుల్యతను, స్థిరత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ఈ యోగా ఆసనం కాళ్లు, చేతుల కండరాలను సాగదీస్తుంది, ఇది పిల్లల ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది. ఈ యోగా భంగిమ వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

భుజంగాసనం ఈ భుజంగాసనం చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. ముఖ్యంగా నడుము కండరాల వశ్యత పెరుగుతుంది. నడుము బిగుతుగా ఉంటే చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. భుజంగాసనం గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

ఈ యోగాతో పాటు పిల్లలకు ప్రాణాయామం చేసే అలవాటు చేయండి. ఇది వారిని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా చేస్తుంది. పిల్లలలో ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య ఉంటే.. యోగా చేసే ముందు ఖచ్చితంగా వైద్యుడిని లేదా యోగా గురువును సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..