Viral Video: చెత్త తీయలేదని.. భర్తను దంచి కొట్టిన భార్య.. నెట్టింట్లో వీడియో వైరల్..

సోషల్ సైట్ ఎక్స్‌లో షేర్ చేసిన ఈ 20 సెకన్ల ఫుటేజ్ ఇంటర్నెట్‌లో కొత్త చర్చకు దారితీసింది. గృహ హింస తీవ్రమైన సమస్య అని నెటిజన్లు అంటున్నారు. అయితే సాధారణంగా మహిళలు మాత్రమే దీని బాధితులు అయినప్పటికీ.. ఈ వైరల్ ఫుటేజీని చూస్తుంటే పురుషులు కూడా ఇలాంటి గృహ హింసకు గురవుతారని చెప్పవచ్చు.

Viral Video: చెత్త తీయలేదని.. భర్తను దంచి కొట్టిన భార్య.. నెట్టింట్లో వీడియో వైరల్..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: May 23, 2024 | 3:39 PM

ప్రస్తుతం ఓ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చినట్లు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. అతను హెల్మెట్ తీస్తున్న సమయంలో లోపల నుంచి ఆ వ్యక్తీ భార్య పరిగెత్తుకుని వచ్చి మరీ అతడిపై తీవ్రంగా దాడి చేసింది. ఆ మహిళ తన శక్తి కొద్దీ భర్తను గట్టిగా తన్నింది. కొట్టింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తన భార్య తనపై దాడి చేస్తూ కొడుతున్నా సరే ఆ వ్యక్తి నిశ్శబ్దంగా దెబ్బలు తింటూనే ఉన్నాడని వీడియో చూస్తే తెలుస్తుంది.

@cctvidiots హ్యాండిల్‌తో వీడియోను షేర్ చేస్తూ, వినియోగదారు ఇలా వ్రాశాడు.. ‘భర్త 14 గంటల షిఫ్ట్‌లో పని చేసిన తర్వాత ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఇంట్లో చెత్త తీయడం మరిచిపోవడంతో ఆగ్రహించిన భార్య అతడిని తీవ్రంగా కొట్టింది. వీడియోను జాగ్రత్తగా పరిశీలించగా.. సీసీటీవీ ఫుటేజీ గతేడాది జనవరి 29 నాటిదని తేలింది. అంటే ఆ సంఘటన అదే రోజు జరిగింది. అయితే ఈ వీడియో ఎక్కడిది అనే విషయంపై స్పష్టత లేదు.

ఇవి కూడా చదవండి

సోషల్ సైట్ ఎక్స్‌లో షేర్ చేసిన ఈ 20 సెకన్ల ఫుటేజ్ ఇంటర్నెట్‌లో కొత్త చర్చకు దారితీసింది. గృహ హింస తీవ్రమైన సమస్య అని నెటిజన్లు అంటున్నారు. అయితే సాధారణంగా మహిళలు మాత్రమే దీని బాధితులు అయినప్పటికీ.. ఈ వైరల్ ఫుటేజీని చూస్తుంటే పురుషులు కూడా ఇలాంటి గృహ హింసకు గురవుతారని చెప్పవచ్చు.

భర్తను మహిళ తీవ్రంగా కొట్టిన వీడియో ఇక్కడ చూడండి.

‘గృహ హింసకు పురుషులు కూడా బాధితులే’ ఒక వినియోగదారు వ్రాశారు ప్రజలు తమను ఎగతాళి చేస్తారని భావించి చాలా మంది పురుషులు తాము ఇంట్లో పడుతున్న ఇబ్బందులను బయటకు చెప్పడానికి ఇష్టపడడం లేదు అని అన్నాడు. అయితే గృహ హింసకు పురుషులు కూడా బాధితులే అన్నది వాస్తవం. అదే సమయంలో చెత్త తీయడం మరిచిపోయినందుకే ఆ భర్తని ఇలా కొట్టింది.. అంటే ఇతర తప్పులకు ఎలాంటి శిక్ష అనుభవిస్తున్నాడో అంటూ కామెంట్ చేయడమే కాదు.. ఇలా ఆలోచించడం ఆశ్చర్యంగా ఉందని మరో యూజర్ వ్యాఖ్యానించారు. చెత్త తీసే విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఆ వ్యక్తి గృహహింసకు గురయ్యాడని వీడియో ద్వారా రుజువైంది అని మరో యూజర్ అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..