Viral Video: ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది.. పోటుగాడిలా మధ్యలో వెళ్లాడు.. కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది..!
ఇద్దరు పొట్లాడుకుంటుంటే.. మధ్యలో వెళ్లిన వ్యక్తికి దెబ్బలు తగలడం ఖాయం.. అంటూ పెద్దలు తరచూ చెబుతుంటారు.. దీని గురించి మనం తరచూ వింటూనే ఉంటాం.. అచ్చం అలాంటి ఘటనే ఒకటి నెట్టింట తెగ వైరల్ గా మారింది.. ఓ మార్కెట్‌లో రెండు ఎద్దులు తమ మధ్య పోట్లాడుకుంటున్నాయి.. వాటి మధ్య పోరాటాన్ని ఆపడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు.
ఇద్దరు పొట్లాడుకుంటుంటే.. మధ్యలో వెళ్లిన వ్యక్తికి దెబ్బలు తగలడం ఖాయం.. అంటూ పెద్దలు తరచూ చెబుతుంటారు.. దీని గురించి మనం తరచూ వింటూనే ఉంటాం.. అచ్చం అలాంటి ఘటనే ఒకటి నెట్టింట తెగ వైరల్ గా మారింది.. ఓ మార్కెట్‌లో రెండు ఎద్దులు తమ మధ్య పోట్లాడుకుంటున్నాయి.. వాటి మధ్య పోరాటాన్ని ఆపడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు.. అనూహ్యంగా చివరకు.. ఓ షాకింగ్ ఘటన జరుగుతుంది.. దీనిని ఎవరూ ఊహించలేరు.. కట్ చేస్తే.. ఆపడానికి వెళ్లిన వ్యక్తి కుయ్యో.. మొర్రో అనుకుంటూ ప్రాణాలతో బయపడ్డాడు.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించి.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. మార్కెట్‌లో రెండు ఎద్దులు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటున్నాయి.. అక్కడ నిలబడిన జనం.. వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. కొంతమంది వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడే బుల్ ఫైట్ ఆపడానికి ఓ వ్యక్తి తన ఆటోతో రావడం కనిపించింది. ఆటోతో వచ్చి రాగానే.. రివర్స్ లో ఎద్దుల వైపు తన ఆటోను రానిస్తాడు.. దీంతో రెండు ఎద్దులు కూడా పొట్లాడటం ఆపేసి దూరం వెళ్తాయి.. ఆ వెంటనే మళ్లీ పొట్లాడుకోవడం మొదలుపెడ్తాయి.. దీంతో ఆటో వ్యక్తి.. ఈ సారి వాటికి ఝలక్ ఇచ్చేందుకు అటుగా పోనిస్తాడు.. దీంతో ఓ ఎద్దు అతడి ఆటోను బలంగా ఢీకొడుతుంది.. దీంతో ఆటో బోల్తా కొట్టింది. ఆటో సహా డ్రైవర్ కూడా కిందపడిపోతాడు.. అనంతరం రెండు ఎద్దులు కూడా అక్కడినుంచి పరిగెడుతాయి..
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
इसी लड़ाई को देखकर बड़े बुजुर्गों ने कहावत बनाई थी की आ बैल मुझे मारा 🐂🛺 pic.twitter.com/2PgRWP7zuO
— Reetesh Pal (@PalsSkit) May 23, 2024
ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X లో @PalsSkit అనే యూజర్ షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించారు. అంతేకాకుండా.. వీడియోను షేర్ చేస్తూ.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అందుకే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదని అంటారు.. గొడవ మధ్యలో వెళితే ఇలానే ఉంటుంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..