పిచ్చి పీక్ స్టేజ్.. బోల్తా పడిన కారు.. అంబులెన్స్ వచ్చే లోపు సెల్ఫీ తీసుకున్న గాయపడిన యువతులు ఎక్కడంటే
సెల్ఫిల పిచ్చి ఏ మేరకు చేరుకుందంటే.. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే గతంలో క్షతగాత్రులకు సాయం చేయడానికి పరిగెట్టే వారు.. ఇప్పుడు అక్కడ సంఘటనను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడానికి తహతహలాడుతున్నారు. ఇప్పుడు ఓ యువతి ఒక అడుగు ముందుకు వేసి తనకు యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ వచ్చే సమయంలో సెల్ఫి తీసుకుంది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు షాక్ తిన్నారు. ఈ ఘటన మెక్సికో లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది..
స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెల్ఫీల పిచ్చి పెరిగిపోయింది. సెల్ఫి మోజులో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న యువతకు సంబంధించిన అనేక వార్తలు చదువుతూనే ఉన్నాం. నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకూ తమకు నచ్చిన ప్రతి సంఘటనను ఫోటోగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ పిచ్చి ఏ మేరకు చేరుకుందంటే.. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే గతంలో క్షతగాత్రులకు సాయం చేయడానికి పరిగెట్టే వారు.. ఇప్పుడు అక్కడ సంఘటనను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడానికి తహతహలాడుతున్నారు. ఇప్పుడు ఓ యువతి ఒక అడుగు ముందుకు వేసి తనకు యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ వచ్చే సమయంలో సెల్ఫి తీసుకుంది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు షాక్ తిన్నారు. ఈ ఘటన మెక్సికో లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.
మెక్సికోలో కారు ప్రమాదం జరగడంతో కారులో ఉన్న ఇద్దరు యువతులకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వస్తుందని రోడ్డుపై కూర్చున్న క్షతగాత్రురాలైన యువతి గాయపడిన స్థితిలో కూడా సెల్ఫీ దిగింది. ఆ యువతి గాయాలు చూసి అక్కడకు చేరుకున్న జనం కంగారు పడ్డారు.
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం శనివారం మెక్సికన్ నగరం క్యూర్నావాకా వీధుల్లో కారు ప్రమాదంలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. కారులో ఐదుగురు మహిళలు ఉన్నారు. డ్రైవింగ్ లో ఉండగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇలా గాయపడిన ఇద్దరు యువతులు ఫుట్‌పాత్‌పై కూర్చొని సెల్ఫీలు దిగుతూ కనిపించారు.
స్థానికమీడియా తెలిపిన వివరాల ప్రకారం.. అంబులెన్స్ వచ్చే వరకు వేచి ఉన్న మహిళలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదే సమయంలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వీరంతా మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గాయపడిన యువతులను చివరికి ఆసుపత్రికి తీసుకెళ్లారు, కారు ప్రమాదం వివరాల గురించి తెలియాల్సి ఉంది. మెక్సికన్ అధికారులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..