ఆడ వేషంలో మగ దొంగలు !! తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌

దొంగలు రూటు మార్చారు. పెరుగుతున్న టెక్నాలజీ లాగానే వీరి ఐడియాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వేషాలు మార్చి రాత్రి వేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో మహిళల వేషధారణలో వచ్చి ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి పాల్పడ్డారు. ఎస్సార్​ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రైవేటు ఉద్యోగి కె.వెంకటేశ్వర్రావు నివాసముంటున్నారు. 16వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి ఒంగోలు వెళ్లారు.

ఆడ వేషంలో మగ దొంగలు !! తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌

|

Updated on: May 23, 2024 | 2:00 PM

దొంగలు రూటు మార్చారు. పెరుగుతున్న టెక్నాలజీ లాగానే వీరి ఐడియాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వేషాలు మార్చి రాత్రి వేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో మహిళల వేషధారణలో వచ్చి ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి పాల్పడ్డారు. ఎస్సార్​ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రైవేటు ఉద్యోగి కె.వెంకటేశ్వర్రావు నివాసముంటున్నారు. 16వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి ఒంగోలు వెళ్లారు. 18వ తేదీ శనివారం ఉదయం ఇంటి పనిమనిషి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగల గొట్టి ఉంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు తెల్లవారుజామున ఇద్దరు దుండగులు మహిళల వేషధారణలో ముసుగులు ధరించి వచ్చినట్లు గుర్తించారు. అపార్టుమెంట్‌లోని ఇంట్లోకి చొరబడి అల్మారాలో దాచిన 4 తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు, ఓ ల్యాప్‌టాప్ దొంగిలించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు వేసవి సెలవులు కావడంతో చాలామంది వెకేషన్స్​కు వెళుతుంటారు. ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుచరులకు చెప్పడమో, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెకేషన్స్​కు వెళ్లడం మంచిదని సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యాన్సర్‌ని తరిమికొట్టే అద్భుత ఫలం.. ఎక్కడ కనిపించినా వదిలిపెట్టకండి

అంత్యక్రియలకు రూ.30 లక్షలు.. అనాథ శవాల్లా వదిలేస్తున్న ప్రజలు

మనిషి మెదడులో అమర్చిన ఇంప్లాంట్ పనిచేస్తోందోచ్‌

వరంగల్ లో చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ పై దూసుకెళ్లిన యువతి

గర్ల్ ఫ్రెండ్ ను ఒళ్లో కూర్చోబెట్టుకొని బైక్ పై యువకుడి స్టంట్

Follow us
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్