వరంగల్ లో చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ పై దూసుకెళ్లిన యువతి
సాధారణంగా మహిళలు యాక్టివా లాంటి గేర్లు లేని టూ వీలర్ నడుపుతూ మాత్రమే కనిపిస్తుంటారు. గేర్లతో ఉన్న, వారి వస్త్రధారణకు అనువుగా లేని బైక్ లను నడపడం చాలా అరుదు. కానీ వరంగల్ లో మాత్రం ఓ యువతి చీర కట్టులోనే స్పోర్ట్స్ బైక్ పై రివ్వున దూసుకెళ్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది! ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వరంగల్ కు చెందిన ఆ యువతికి స్పోర్ట్స్ బైక్ నడపడమంటే పిచ్చి. ఇందుకోసం ఏకంగా జెట్టీ బైకర్ గర్ల్ పేరిట ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేస్తోంది.
సాధారణంగా మహిళలు యాక్టివా లాంటి గేర్లు లేని టూ వీలర్ నడుపుతూ మాత్రమే కనిపిస్తుంటారు. గేర్లతో ఉన్న, వారి వస్త్రధారణకు అనువుగా లేని బైక్ లను నడపడం చాలా అరుదు. కానీ వరంగల్ లో మాత్రం ఓ యువతి చీర కట్టులోనే స్పోర్ట్స్ బైక్ పై రివ్వున దూసుకెళ్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది! ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వరంగల్ కు చెందిన ఆ యువతికి స్పోర్ట్స్ బైక్ నడపడమంటే పిచ్చి. ఇందుకోసం ఏకంగా జెట్టీ బైకర్ గర్ల్ పేరిట ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేస్తోంది. వివిధ డ్రెస్ లు ధరించి బైక్ నడిపిన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటోంది. అయితే ఎక్కడా తన మొహం కనిపించకుండా ప్రతి వీడియోలోనూ హెల్మ్ ట్ ధరిస్తూ ఫొటోలు, వీడియోలు పెడుతోంది. అందులో భాగంగానే తాజాగా చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ నడిపిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో బైక్ పై యువతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. పిస్తా కలర్ చీర, అందుకు మ్యాచింగ్ గాజులు కూడా వేసుకుంది. బైక్ పై వెళ్తున్న మరో కుటుంబంలో వెనక కూర్చున్న మహిళ.. ఆ యువతిని కాసేపు అలాగే చూస్తుండిపోయింది. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ పడగానే గేర్ మార్చి దూసుకెళ్లింది. ఈ నెల 5న ఇన్ స్టా లో పోస్ట్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు 3.16 లక్షల లైక్ లు లభించాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గర్ల్ ఫ్రెండ్ ను ఒళ్లో కూర్చోబెట్టుకొని బైక్ పై యువకుడి స్టంట్
మీరు కరోనా బాధితులా ?? అయితే.. మీ గుండె పైలం !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

