మీరు కరోనా బాధితులా ?? అయితే.. మీ గుండె పైలం !!
గతంలో కరోనా బారిన పడ్డారా? తీవ్ర లంగ్స్ సమస్యనూ ఎదుర్కొన్నారా? అయితే మీరు మీ గుండె మీద ఓ కన్నేసి ఉంచండి. కరోనా వైరస్ నేరుగా గుండె కణజాలం మీద దాడి చేయకపోయినా గుండెను దెబ్బతీసే ప్రమాదముందని తాజాగా అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనాతో గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనేక మంది కరోనా బాధితుల్లో గుండె దెబ్బతింటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
గతంలో కరోనా బారిన పడ్డారా? తీవ్ర లంగ్స్ సమస్యనూ ఎదుర్కొన్నారా? అయితే మీరు మీ గుండె మీద ఓ కన్నేసి ఉంచండి. కరోనా వైరస్ నేరుగా గుండె కణజాలం మీద దాడి చేయకపోయినా గుండెను దెబ్బతీసే ప్రమాదముందని తాజాగా అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనాతో గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనేక మంది కరోనా బాధితుల్లో గుండె దెబ్బతింటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వైరస్ నేరుగా గుండె కణజాలం మీద దాడి చేయటమా? రోగనిరోధక వ్యవస్థ స్పందించే క్రమంలో పుట్టుకొచ్చే వాపు ప్రక్రియనా? అనేది తెలియాల్సి ఉంది. గుండెలోని రోగనిరోధక కణాల మీద పరిశోధనలు చేశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తీవ్ర గుండె సమస్య మూలంగా మరణించినవారి గుండె కణజాలాన్ని పరిశీలించారు. ఈ పరిశోధనల్లో గుండె రోగనిరోధక కణాల సంఖ్య పెరిగినట్టు తేలింది. ఇవి మామూలు కణాల స్థితి నుంచి వాపు కారకాలుగా మారినట్టు బయట పడింది. ఇది ఒక్క గుండెకే పరిమితం కాకపోవచ్చని, ఇతర వైరస్‌లతోనూ ఇలాంటి ముప్పు పొంచి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. చికిత్సలతో వాపు ప్రక్రియను అదుపులో పెట్టినట్టయితే గుండె సమస్యల ముప్పు తగ్గటానికీ వీలుంటుందనీ సూచిస్తున్నారు. ఎవరి జాగ్రత్తలో వారుండాలని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

