అంత్యక్రియలకు రూ.30 లక్షలు.. అనాథ శవాల్లా వదిలేస్తున్న ప్రజలు
కెనడాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. చనిపోయిన కుటుంబ సభ్యుల అంత్యక్రియలు కూడా నిర్వహించలేక అనాథ శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. అంత్యక్రియల ఖర్చు ఏకంగా రూ. 30 లక్షలు దాటుతుండడమే అందుకు కారణం. అంతసొమ్ము చెల్లించడం తమవల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది.
కెనడాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. చనిపోయిన కుటుంబ సభ్యుల అంత్యక్రియలు కూడా నిర్వహించలేక అనాథ శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. అంత్యక్రియల ఖర్చు ఏకంగా రూ. 30 లక్షలు దాటుతుండడమే అందుకు కారణం. అంతసొమ్ము చెల్లించడం తమవల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ శవాలను గుర్తించగా పదేళ్లు తిరిగేసరికి అంటే 2023కి ఆ సంఖ్య 1,183కు చేరుకుంది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అవి తమవారివేనని కుటుంబ సభ్యులు గుర్తించినప్పటికీ, అంత్యక్రియల ఖర్చుకు భయపడి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. కెనడాలో అంత్యక్రియలకు సగటున 30 వేల డాలర్లకు పైనే అవుతోంది. గ్రేటర్ టొరొంటోలో అయితే ఇది 34 వేల డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో ఇది దాదాపు రూ. 27 లక్షలు. ఇది ఒక్క అంత్యక్రియల నిర్వహణ ఖర్చు మాత్రమే. ఇతర ఖర్చులు కూడా కలుపుకొంటే రూ. 30 లక్షలు దాటేస్తోంది. ఇంత ఖర్చును భరించలేని కుటుంబాలు తమవారి మృతదేహాలను అనాథల్లా వదిలిపెట్టేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనిషి మెదడులో అమర్చిన ఇంప్లాంట్ పనిచేస్తోందోచ్
వరంగల్ లో చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ పై దూసుకెళ్లిన యువతి
గర్ల్ ఫ్రెండ్ ను ఒళ్లో కూర్చోబెట్టుకొని బైక్ పై యువకుడి స్టంట్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

