Lychee Benefits: సీజనల్ ఫ్రూట్ లిచీని మిస్ చేసుకుంటున్నారా.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అవుతున్నారో తెలుసా..
వేసవి వచ్చిదంటే చాలు సీజనల్ పండ్లను తినడానికి ఆసక్తిని చూపిస్తారు. మామిడి పండ్లు, పుచ్చకాయలు, పనస పండ్లు, తాటి ముంజేలు వంటివి మార్కెట్ లో దర్శనమిస్తాయి. అయితే ఈ సీజనల్ ఫ్రూట్ తో పాటు జ్యూసీ ఫ్రూట్ అయిన లిచీని కూడా తినే ఆహారంలో చేర్చుకోండి. సుమారు తాటి ముంజెల టేస్ట్ ఉండే లిచీ ని తినడం వలన శరీరం డీ హైడ్రేట్ బారిన పడకుండా ఉంటారు. అంతేకాదు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తీపి లిచీని రుచి చూడకుంటే మీకే నష్టం. సీజనల్ ఫ్రూట్ అయిన లిచీని తింటే అనేక రోగాల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు.