Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అబ్బా ఈ రైతు టాలెంటే వేరు.. అరుదైన పంటను పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..

కందుకూరు మండలం దెబ్బగూడకు చెందిన జైపాల్ నాయక్ అనే వ్యక్తి.. తమ సొంత భూమిలో అవకాడో అనే పంటను సాగు చేస్తున్నాడు. 38 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో పెరిగే ఉష్ణ మండల పండును పండిస్తున్నాడు. అయితే తెలంగాణలో ఇదే మొదటి అవకాడో పంట. అంతేకాక బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి దిగుమతి చేసుకున్న మొదటి ఆస్ట్రేలియన్ అవోకాడో రకం కూడా కావడం విశేషం. జైపాల్ నాయక్ లండన్‌లోని ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత కరోనా సమయంలో ఇండియాకు వచ్చేశాడు. ఇంటి దగ్గరే ఉంటూ తన సొంత భూమిలో అవకాడో సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే మొక్కలు ఎక్కడో దొరుకుతున్నట్లు తెలుసుకున్నాడు.

Telangana:  అబ్బా ఈ రైతు టాలెంటే వేరు.. అరుదైన పంటను పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..
Avacado
Follow us
Aravind B

|

Updated on: Aug 10, 2023 | 3:04 PM

మెక్సికో, మధ్య అమెరికా దేశాల్లో ఉండే… అవోకాడో అనే పండును తెలంగాణలో ఓ గిరిజన రైతు పండిస్తూ అత్యధిక లాభాన్ని పొందుతున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బగూడకు చెందిన జైపాల్ నాయక్ అనే వ్యక్తి.. తమ సొంత భూమిలో అవకాడో అనే పంటను సాగు చేస్తున్నాడు. 38 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో పెరిగే ఉష్ణ మండల పండును పండిస్తున్నాడు. అయితే తెలంగాణలో ఇదే మొదటి అవకాడో పంట. అంతేకాక బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి దిగుమతి చేసుకున్న మొదటి ఆస్ట్రేలియన్ అవోకాడో రకం కూడా కావడం విశేషం. జైపాల్ నాయక్ లండన్‌లోని ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత కరోనా సమయంలో ఇండియాకు వచ్చేశాడు. ఇంటి దగ్గరే ఉంటూ తన సొంత భూమిలో అవకాడో సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే మొక్కలు ఎక్కడో దొరుకుతున్నట్లు తెలుసుకున్నాడు. ఆ తర్వాత నర్సరీ ఉన్న పండ్ల రైతును కలిశాడు. తాను అవకాడో అనే పంట పండించాలనుకుంటున్నాని అతడికి చెప్పాడు.

అందుకోసం మొక్కలు అడగ్గా.. కృష్ణారెడ్డి వాటిని ఇచ్చేందుకు అంగీకరించాడు. అయితే తాను ఆస్ట్రేలియాకి చెందిన అవకాడో రకాన్ని బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు చెప్పాడు. ఇలా దాదాపు 200 వరకు మొక్కలు కొనుగోలు చేసిన జైపాల్ నాయక్.. తన సొంత భూమిలో ఈ మొక్కలను సాగు చేశాడు. కొంతమంది రైతులు ఒకటీ, రెండు మొక్కలు మాత్రమే తీసుకున్నారని కృష్ణారెడ్డి అన్నారు. కానీ జైపాల్ నాయక్ మాత్రం ధైర్యంతో చాలా మొక్కలు తీసుకున్నాడని అన్నారు. దాదాపు 200 వరకు మొక్కలు నాటిన జైపాల్ మూడేళ్ల లోనే తన మొదటి పంటను అందుకున్నాడు. ఆయనకు వచ్చే లాభాలను చూసి మరికొంతమంది రైతులు కృష్ణారెడ్డిన సంప్రదిస్తున్నారు. అయితే చివరికి జైపాల్ రెడ్డి కన్న కల నెరవేరింది. నెల క్రితమే పంట చేతికి వచ్చింది. దాదాపు 600 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ పండు రుచి చూసేందుకు తరలివచ్చారు. ఆ పండ్లను కొనుగోలు చేశారు. కేవలం మూడు రోజుల్లోమో పంట మొత్తం అమ్ముడు పోయింది. దీంతో జైపాల్ నాయక్‌కు 4 లక్షల రూపాయల వరకు లాభం వచ్చింది.

ఒక్కసారి ఈ మొక్కలు నాటితే దాదాపు 30 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం రెండు పంటలు పండుతాయని చెప్పారు. అలాగే ఇప్పుడు చేతికి రానున్న పంటను కూడా కువైట్‌కు ఎగుమతి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. మరో విషయం ఏంటంటే తెలుగు మీడియంలో చదువుకున్న నాయక్.. ఇంగ్లీష్ రాకపోయిన లండన్ వెళ్లి ఎంబీఏలో చేరారు. ఆ తర్వాత సొంత స్థలానికి వచ్చి చాలా ఉద్యోగాలు చేశారు. ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేక సొంతంగా ఏదైనా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అవకాడో సాగు చేయాలని ఆలోచన వచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే పంట సాగు కోసం ఒక లక్ష 40 వేల రూపాయల ఖర్చు వచ్చిందని చెప్పాడు. అయితే ఇప్పటివరకు నాలుగు లక్షల వరకు లాభం వచ్చినట్లు చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం