PM Modi Speech Live: అవిశ్వాస తీర్మానంపై ప్రధాని సమాధానం.. లోక్‌సభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్‌

Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Aug 11, 2023 | 3:13 PM

PM Modi Speech Live: అవిశ్వాస తీర్మానంలో భాగంగా మూడో రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభలో సమాధానం ఇవ్వనున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో మణిపూర్ విషయంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఎలా సమాధానం ఇవ్వనున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.

PM Modi Speech Live: మణిపూర్ హింసకు వ్యతిరేకంగా లోక సభలో విపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మూడో రోజు వాడీవేడిగా కొనసాగుతోంది. అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా అధికారపక్షం వర్సెస్.. విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానంలో భాగంగా మూడో రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభలో సమాధానం ఇవ్వనున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో మణిపూర్ విషయంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఎలా సమాధానం ఇవ్వనున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. రెండు రోజులుగా విపక్షాలు చేస్తున్న ఆరోపణలు.. ప్రభుత్వం ఇస్తున్న కౌంటర్లతో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాహుల్ గాంధీ ప్రసంగం అనంతరం.. స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కాంగ్రెస్ తోపాటు విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే.. ప్రధాని మోడీ లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతున్నారు.. లైవ్ లో చూడండి..

Published on: Aug 10, 2023 03:50 PM