ఆక్సిజన్ ఉత్పత్తికోసం స్టెరిలైట్ ప్లాంట్ పునరుద్ధరణకు తమిళనాడు ప్రభుత్వ అనుమతి

తమిళనాడు లోని తూత్తుకుడిలో మూడేళ్ళ క్రితం మూసివేసిన స్టెరిలైట్ ప్లాంట్ ను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఈ ప్లాంట్ లో మళ్ళీ ఆక్సిజన్ ఉత్పత్తి కానుంది.

ఆక్సిజన్ ఉత్పత్తికోసం స్టెరిలైట్ ప్లాంట్ పునరుద్ధరణకు తమిళనాడు ప్రభుత్వ అనుమతి
Tamilnadu Allows Sterilite Plant To Open For 4 Months
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 26, 2021 | 5:46 PM

తమిళనాడు లోని తూత్తుకుడిలో మూడేళ్ళ క్రితం మూసివేసిన స్టెరిలైట్ ప్లాంట్ ను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఈ ప్లాంట్ లో మళ్ళీ ఆక్సిజన్ ఉత్పత్తి కానుంది. కానీ 4 నెలల పాటు మాత్రమే ఇది పని చేసేందుకు అనుమతినిస్తున్నామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో ఆక్సిజన్ కి తీవ్ర కొరత ఏర్పడింది.  ఫలితంగా   స్టెరిలైట్ ప్లాంట్ పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇందులో కాపర్ (రాగి) ని ఉత్పత్తి చేయరాదని ఆదేశించారు. ఈ ప్లాంట్ పనితీరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ పానెల్ లో ..లోగడ కాపర్ ఉత్పత్తిని వ్యతిరేకించిన స్థానికులను సభ్యులుగా నియమించాలని తూత్తుకుడి నియోజకవర్గ ఎంపీ అయిన డీఎంకే ఎంపీ  కనిమొళి సూచించారు.

స్టెరిలైట్ ప్లాంట్ ను మళ్ళీ ప్రారంభించాలన్న ప్రతిపాదనపై సోమవారం ఉదయం ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరాలు పెరిగిన దృష్ట్యా ఈ ప్లాంట్ ను పునరుద్ధరించవచ్చునని, అయితే మన రాష్ట్రానికి ఈ ప్లాంట్ ఉచితంగా ఆక్సిజన్ ఇవ్వాలని  డీఎంకే అధినేత స్టాలిన్ సూచించారు.

ఈ ప్లాంట్ వల్ల కాలుష్యం పెరిగిపోతోందని, దీన్ని  మూసివేయాలని  2018 లో స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 17 మంది మృతి చెందారు.ఆ పరిణామాల నేపథ్యంలో ఈ ప్లాంట్ ను మూసివేశారు.  దీన్ని తాము చేపడుతామంటూ గత ఏడాది మైనింగ్ సంస్థ వేదాంత కోరగా సుప్రీంకోర్టు ఇందుకు తిరస్కరించింది. అంతకు ముందు మద్రాస్ హైకోర్టు కూడా అనుమతిని నిరాకరించింది. తమిళనాడులో కొత్తగా 15,659 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 10.8 లక్షలకు చేరుకుంది.

మరిన్ని ఇక్కడ చూడండి: West Bengal Election 2021 Phase 7 Voting LIVE: ప్రశాంతంగా ఏడో విడత పోలింగ్.. కోల్‌కతాలో ఓటేసిన సీఎం మమతా బెనర్జీ

US Army: నూరేళ్ళ అమెరికా ఆర్మీలో కఠినమైన శిక్షణ పూర్తి చేసి చరిత్ర సృష్టించిన మహిళా సైనికులు!