US Army: నూరేళ్ళ అమెరికా ఆర్మీలో కఠినమైన శిక్షణ పూర్తి చేసి చరిత్ర సృష్టించిన మహిళా సైనికులు!

యుఎస్ ఆర్మీ 100 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి, మహిళా సైనికులు లింగ వివక్ష చివరి అడ్డంకిని దాటారు.

US Army: నూరేళ్ళ అమెరికా ఆర్మీలో కఠినమైన శిక్షణ పూర్తి చేసి చరిత్ర సృష్టించిన మహిళా సైనికులు!
America women Army
Follow us
KVD Varma

|

Updated on: Apr 26, 2021 | 5:37 PM

US Army: యుఎస్ ఆర్మీ 100 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి, మహిళా సైనికులు లింగ వివక్ష చివరి అడ్డంకిని దాటారు. లిమా కంపెనీకి చెందిన ఉమెన్స్ ప్లాటూన్ కు చెందిన 53 మంది మహిళా సైనికులు మెరైన్ కార్ప్స్ లోని అత్యంత కష్టమైన కోర్సును పూర్తి చేశారు. కాలిఫోర్నియాలోని క్యాంప్ పెంటెల్‌టన్‌లో దాదాపు 11 వారాల కఠినమైన శిక్షణ తర్వాత ఆ మహిళా ప్లాటూన్ ఇప్పుడు అధికారికంగా మెరైన్‌గా మారింది. మహిళలు ఈ కోర్సు పూర్తి చేయడం ఇదే మొదటిసారి. వీరు 9 ఫిబ్రవరి 2021 న శిక్షణ ప్రారంభించారు. ఈ శిక్షణ పొందిన వారిలో 20 ఏళ్ల అబిగైల్ రాగ్లాండ్ ఒకరు. ఆమె మాట్లాడుతూ..”మిలియన్ల కళ్ళు మాపై ఉన్నాయి. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలమవ్వాలని అనుకోలేదు.” అని చెప్పారు. 19 ఏళ్ల అన్నీ తన అనుభవాన్ని వివరిస్తూ ”నేను జీవితంలో సులభమైన సవాళ్లను ఎప్పుడూ కోరుకోలేదు. నేను మెరైన్స్ కోసం తయారైన మొదటి రోజునే ఎంత కష్టమైనా భరించాలని నేను భావించాను.” అని పేర్కొన్నారు. ఇడాహోకు చెందిన 19 సంవత్సరాల మియా ఓ హారా ఇలా అన్నారు. ”చివరి అధిరోహణలో, ప్లాటూన్ జెండా నా చేతుల్లో ఉంది. ఇంతకంటే సంతోషం ఏముంటుంది?” ఈ ఆరోహణ చాలా క్లిష్టమైనది. ఇది జీవితంలోని చివరి అధిరోహణ అని చాలాసార్లు భావించాము. కాని మమ్మల్ని స్వాగతించడానికి ఎవరో ఒకరు చివరిలో నిలబడ్డారనే నమ్మకం కూడా ఉంది. ఆ నమ్మకంతోనే మా ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేశాము అని వారంతా సంబరంగా చెబుతున్నారు. వీరంతా క్లిష్టమైన ట్రైనింగ్ పూర్తి చేసుకుని మెరైన్స్ గా నిలిచారు. క్లిష్టమైన శిక్షణ.. పురుషులతో సమానంగా.. పురుష కమాండోలతో సమానంగా వారికి శిక్షణ ఇచ్చారు. తెల్లవారుజామున 3 నుండి రాత్రి వరకు చాలా అలసిపోయే శిక్షణ. కేవలం 3 గంటలు మాత్రమే వారికి నిద్రాసమయం. 35 కిలోల బరువుతో 15 కిలోమీటర్ల కష్టతరమైన అధిరోహణతో పాటు, పందెం, దుమ్ము, కోణాల శిఖరాలపై బురద వంటివి వాటిలో దాటడం కూడా ఈ శిక్షణలో నేర్పించారు.

Also Read: కరోనా రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందా.. అయితే ఈ విషయాల్లో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే మోసం మొదటికే..

Corona Effect: ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే