AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mother and Child: తల్లీ బిడ్డల అనుబంధం..! ప్రాణకోటి మొత్తానికి ఈ బంధం ప్రత్యేకమైనదే! వీడియో చూడండి మీరూ ఒప్పుకుంటారు!

మీకోసం ఒక ఉల్లాసాన్నిచ్చె వీడియోను పరిచయం చేస్తున్నాం. తల్లీ బిడ్డల మధ్య ఉండే ప్రేమానుబంధాన్ని చూడండి ఎంత ముచ్చటగా ఉందొ!

Mother and Child: తల్లీ బిడ్డల అనుబంధం..! ప్రాణకోటి మొత్తానికి ఈ బంధం ప్రత్యేకమైనదే! వీడియో చూడండి మీరూ ఒప్పుకుంటారు!
Monkey Love
KVD Varma
|

Updated on: Apr 26, 2021 | 5:13 PM

Share

Mother and Child: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కరోనాకు సంబంధించిన వార్తలే. కరోనా ప్రస్తావన లేని విషయాలు ఉండటం లేదు. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఇంటిపట్టునే ఉండడటం.. మాస్క్ ధరించడం.. గుంపుల్లోకి వెళ్లకపోవడం ఇవే ఆయుధాలు. అయితే, ఇంటిదగ్గర ఉంది విసిగిపోయే మనకు మనసుకు ఉల్లాసాన్నిచ్చే విశేషాలు చూడాలనిపిస్తుంది. అందుకే మీకోసం ఒక ఉల్లాసాన్నిచ్చె వీడియోను పరిచయం చేస్తున్నాం. ఈ వీడియో పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్‌లో షేర్ చేశారు. తల్లీ బిడ్డల మధ్య ఉండే ప్రేమానుబంధాన్ని తన కెమెరాలో బంధించిన ఆయన దీనిని అందరికోసం ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఒక తల్లి కోతి చేతిలో ఆమె పిల్ల కోతి ఉంది వీడియోలో. సహజంగానే పిల్లలు అల్లరి చేసినట్టే.. ఆ పిల్ల కోతీ అల్లరి చేస్తోంది. అమ్మను వదిలేసి దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మపైకే ఎక్కేసేందుకు ప్రయత్నిస్తోంది. తన బిడ్డను కాపాడుకోవడానికి తల్లి ఎపుడూ ప్రయత్నిస్తుంది. అలాగే ఈ అమ్మ కోతి కూడా తన పిల్లను చేయిపట్టి ఆపి ‘నో..వెళ్లొద్దు’ అన్నట్టు చూసింది. దీంతో అంత అల్లరిగా చెట్టు ఎక్కేయడానికి ప్రయత్నిస్తున్న పిల్ల కోతి వెంటనే అమ్మ దగ్గరకు ఒక్క ఉదుటున వచ్చి వాలిపోయింది. అమ్మ మొహాన్ని ముద్దులతో ముంచేసింది. అమ్మా.. నన్ను ఆడుకోనీయవా అన్నట్టుగా అమ్మ మీద ఎంతో ప్రేమ కురిపించేసింది. ఆ తల్లి తన బిడ్డ చూపిస్తున్న ప్రేమను చూసి మురిపెంగా మురిసిపోయింది. ఇదీ వీడియోలో ఉన్న కథ.

ఈ వీడియో చూస్తే మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. జంతువులు అయినా.. మాటలు చెప్పలేకపోయినా.. అవి చూపించిన హావభావాలు చూస్తె భలే అనిపిస్తాయి. ఈ వీడియో చూస్తే మీరూ అవునంటారు.. ఆ వీడియో ట్వీట్ ఇదిగో..

ఈ వీడియో షేర్చే సిన గోయెంకా దీనికి ఇచ్చిన క్యాప్షన్ “నేను దీనిని చూశాను వెంటనే దేవుని తలుచుకున్నాను..,‘ ప్రభూ, నాకు ఒక సహాయం కావాలి. మీరు నా అమ్మను కౌగిలించుకుని, ఆమె చెంపపై ముద్దు పెట్టి, అది నా నుండి వచ్చినట్లు ఆమెకు చెబుతారా.” అంటూ ప్రార్ధించాను.” కూడా ఆకట్టుకుంటోంది. తల్లి ప్రేమ కోసం అల్లాడే చిన్న పిల్లాడి కోరికలా ఉంది కదూ ఇది.

Also Read: Corona Effect: ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Josh Fight: జోష్ ఉండాల్సిందే.. అమెరికాలో సరికొత్త ఆటను ఆడించిన కాలేజీ స్టూడెంట్..సోషల్ మీడియాలో ట్రెండింగ్!