Josh Fight: జోష్ ఉండాల్సిందే.. అమెరికాలో సరికొత్త ఆటను ఆడించిన కాలేజీ స్టూడెంట్..సోషల్ మీడియాలో ట్రెండింగ్!

ఏదైనా జోష్ ఉండాల్సిందే. మన జీవితంలో జోష్ లేకపోతే ముందడుగు వేయడం కష్టం. సినిమా చూడటంలో కావచ్చు.. స్నేహితులతో గడపడం అవ్వొచ్చు

Josh Fight: జోష్ ఉండాల్సిందే.. అమెరికాలో సరికొత్త ఆటను ఆడించిన కాలేజీ స్టూడెంట్..సోషల్ మీడియాలో ట్రెండింగ్!
Josh Fight
Follow us

|

Updated on: Apr 26, 2021 | 5:00 PM

Josh Fight: ఏదైనా జోష్ ఉండాల్సిందే. మన జీవితంలో జోష్ లేకపోతే ముందడుగు వేయడం కష్టం. సినిమా చూడటంలో కావచ్చు.. స్నేహితులతో గడపడం అవ్వొచ్చు.. బంధువులతో కాలక్షేపం లేదా చేస్తున్న పనిపై ఇంట్రస్ట్ ఇలా ఏదైనా సరే ఉత్సాహంగా చేస్తేనే బావుంటుంది. ఎదో మామూలుగా ఉంటె ఏం బావుంటుంది. మనం చేసే పనిలో జోష్ లేకపోతె హుషారు తగ్గిపోతుంది.

కరోనా కల్లోలంతో సంవత్సర కాలంగా ప్రజల్లో మునుపటి జోష్ లేదు. యాంత్రికంగా.. అయిపొయింది అందరి జీవితం. ఒక సంబరం లేదు. అందరూ కలిసి ఆటపాటల్లో మునిగితేలే అవకాశం లేదు. ఈ పరిస్థితి అరిజోనాలోని టక్సన్ ప్రాంతానికి చెందిన జోష్ స్వైన్ అనే 22 ఏళ్ల కాలేజీ స్టూడెంట్ కు విసుగు పుట్టించింది. దీంతో అతను ఎదో ఒకటి చేయాలనుకున్నాడు. తన పేరు జోష్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రత్యేకమైన జోష్ పోటీకి అందరినీ పిలిచాడు. రండి అందరూ ‘జోష్’ తో దెబ్బలాడుకుందాం అంటూ సవాల్ విసిరాడు. నెబ్రాస్కా పార్కు లో శనివారం వేడి వేడిగా పూల్-నూడిల్ ఫైట్ చేద్దాం అంటూ పిలిచాడు. ఇంకేముంది అందరికీ జోష్ కావాలని ఉంది. ఇదేదో బావుంది అనిపించింది. వందలాది మంది యూఎస్ఏ చుట్టుపక్కల నుంచి వచ్చి ఈ జోష్ సరదాలో పాల్గొన్నారు.

ఇంతకీ ఇది ఏమిటంటే.. “రాక్, పేపర్, సిజర్స్ ఇలాంటి వస్తువులతొ ఒకరి మీద ఒకరు సరదాగా దాడి చేయడమే. అరిజోనాకు చెందిన జోష్ స్వైన్ అలాగే, ఒమాహా నుండి మరొక జోష్ స్వైన్ మధ్య ఈ ధర్మ బద్ధమైన యద్ధం జరిగింది. ఇందులో ఆరిజోనా నుంచి వచ్చిన జోష్ స్వైన్ గెలిచినట్టు ప్రకటించారు.

అమెరికన్ స్పోర్ట్స్ అనలిస్ట్ పాట్ మకాఫీ, పూల్-నూడిల్ గందరగోళ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇది ఉల్లాసంగా ఉందన్న అతను ఈ వీడియోకు “ఈ వీడియోలోని ప్రతి ఒక్కరికీ జోష్ అని పేరు పెట్టారు … వారు ఈ పూల్ నూడుల్స్ తో జోషిన్ చెయ్యట్లేదు.. జోష్ తొ ఉండబోతున్నారు.” అని శీర్షిక పెట్టాడు.

ఈ ట్వీట్ ను ఇప్పుడు చాలా మంది లైక్ చేస్తున్నారు. కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: దేశంలో క‌రోనా మహోగ్రరూపం… కష్టకాలంలో భారత్‌కు అండగా ఉంటాం.. అవసరమైన వైద్య సహాయాలు అందిస్తాంః అస్ట్రేలియా

Corona: గుండెలు పగిలిపోతున్నాయి..మా సహాయం కచ్చితంగా చేస్తాం..గూగుల్ సీయీవో సుందర్ పిచాయ్..మైక్రోసాఫ్ట్ సీయీవో సత్యనాదెళ్ళ