Google Doodle: ఫ్రంట్ లైన్ వారియర్స్ చేస్తున్న సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ అందర్నీ ఆకట్టుకునేలా గూగుల్ డూడుల్!
గూగుల్ ఏది చేసినా చాలా ఇన్నోవేటివ్ గా చేస్తుంది. ప్రస్తుత కరోనా అల్లకల్లోల పరిస్థితుల్లో ఈరోజు గూగుల్ తనదైన బాణీలో డూడుల్ వదిలింది.
Google Doodle: గూగుల్ ఏది చేసినా చాలా ఇన్నోవేటివ్ గా చేస్తుంది. ప్రస్తుత కరోనా అల్లకల్లోల పరిస్థితుల్లో ఈరోజు గూగుల్ తనదైన బాణీలో డూడుల్ వదిలింది. కరోనా వైరస్ సంక్షోభంలో అత్యవసర పరిస్థితుల్లో కష్టపడుతున్న వారికి ధన్యవాదాలు చెబుతూ ఈ డూడుల్ రూపొందించింది గూగుల్. ఈ యానిమేట్ గూగుల్ లో హృదయం ఎమోజీ ఉంచారు. ఇది కరోనా కల్లోలంలో ముందు వరుసలో నిలబడి సేవలు అందిస్తున్నవారి పట్ల అపరిమిత ప్రేమను.. గౌరవాన్ని సూచిస్తుంది. ఇది సమాజంలోని ప్రజారోగ్య కార్యకర్తలకు.. శాస్త్రీయ సమాజంలోని పరిశోధకులకూ గూగుల్ ప్రత్యేకంగా ఇచ్చిన ధన్యవాదాల సందేశం. ఈ ప్రత్యెక లోగోపై కర్సర్ ఉంచినపుడు మనకు ”కల్లోల సమయంలో ప్రజలకు అండగా ఉన్న పబ్లిక్ హెల్త్ సిబ్బంది అలాగే శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్న వారికీ ప్రత్యెక కృతజ్ఞతలు.” అనే క్యాప్షన్ కనిపిస్తుంది.
గూగుల్ ప్రతి ప్రత్యెక సందర్భానికీ తగిన డూడుల్స్ తన సెర్చ్ పేజిలో ఉంచుతుంది. ఇలా ఇప్పటివరకూ ఎన్నో డూడుల్స్ ఇలా ఉంచింది గూగుల్. ఆ ప్రత్యేకతను ప్రతిబింబించేలా.. తన గూగుల్ పేరును స్పష్ట పరిచేలా ఈ డూడుల్స్ రూపొందిస్తుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళలో బాధితులకు సేవలు చేస్తున్న వారికి గూగుల్ ఇచ్చిన గౌరవంగా ఈ డూడుల్ నిలిచింది. ఇప్పటికే గూగుల్ కరోనా వైరస్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలనే అంశంపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సామాజిక దూరం పాటించడం.. మాస్క్ లు తప్పనిసరిగా ఉపయోగించడం వంటి అంశాలు ప్రజలకు అవగాహన కలిగిస్తోంది గూగుల్.
కాగా.. కోవిడ్ -19 కేసుల పెరుగుదల, అదేవిధంగా మరణాలు ఆదివారం కొత్త రికార్డులకు చేరుకున్నాయి. దేశంలో రోజుకు 349,691 కొత్తగా వైరస్ బారిన పడగా వారిలో 2,767 మరణాలు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఆదివారం మొత్తం 2,767 మంది మరణించినట్లు తెలిసింది, దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనావైరస్ మరణాలు 1,92,311 కు చేరుకున్నాయి.
Also Read: పిల్లలపై పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. పిల్లల్లో కరోనా లక్షణాలు ఏంటి.. వైద్యులేమంటున్నారు..?