కరోనా లక్షణాలు చాలా ఇబ్బంది పెట్టాయి.. ఎవరో నాపై అదిమి కూర్చునట్లు అనిపించేది: హాలీవుడ్ నటుడు

కరోనా లక్షణాలు చాలా ఇబ్బంది పెట్టాయి.. ఎవరో నాపై అదిమి కూర్చునట్లు అనిపించేది: హాలీవుడ్ నటుడు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండం కొనసాగుతోంది. ఈ వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన కొత్తలో మరణాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ

TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 13, 2020 | 1:51 PM

Hugh Grant covid 19 battle: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండం కొనసాగుతోంది. ఈ వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన కొత్తలో మరణాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు అన్ని దేశాల్లో కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం కాస్త ఊరటను కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఈ వ్యాధి సోకి జయించిన వారిలో బాలీవుడ్‌ నటుడు, నిర్మాత హ్యూ గ్రాంట్‌ ఒకరు. ఫిబ్రవరిలో హ్యూతో పాటు ఆయన భార్యకు వైరస్ సోకగా.. వారిద్దరు కోలుకున్నారు. కాగా తాను ఎదుర్కొన్న కరోనా లక్షణాలపై హ్యూ ఇటీవల చెప్పుకొచ్చారు. (మేనకోడలితో ప్రభుదేవా రెండో వివాహం..!)

కరోనా లక్షణాలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. నాకు చెమట బాగా వచ్చేది. నా కనుగుడ్డు మూడు రెడ్లు పెరిగినట్లుగా అనిపించేది. ఒక బరువైన మనిషి నా చెస్ట్‌(అదరం)పై కూర్చున్నట్లు ఉండేది అని హ్యూ చెప్పుకొచ్చారు. ఇక మొదట్లో తాను వాసన చూసే శక్తిని కోల్పోయానని ఆయన తెలిపారు. ఆ సమయంలో పువ్వుల వాసన, చెత్త వాసన కూడా తనకు తెలియలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇంట్లో తన భార్య పర్ఫూమ్‌ని మొహం మీద కొట్టుకున్నానని.. ఆ స్మెల్‌ కూడా తెలియకపోగా, తన కళ్లకు ఏమీ కాలేదని నవ్వుతూ వివరించాడు. ఇక సెల్ఫ్‌ క్వారంటైన్‌లో తన కుమార్తె బార్బీ డాల్స్‌తో ఆడుకున్నట్లు హ్యూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. (కరోనా అప్‌డేట్స్‌: దేశవ్యాప్తంగా 87లక్షలు దాటిన పాజిటివ్‌ కేసుల సంఖ్య.. కోలుకున్న 81లక్షల మంది)

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu