‘బ్రోచేవారెవరురా’ దర్శకుడితో నాని నెక్ట్స్ మూవీ.. టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోన్న నజ్రియా

'బ్రోచేవారెవరురా' దర్శకుడితో నాని నెక్ట్స్ మూవీ.. టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోన్న నజ్రియా

నాచురల్‌ స్టార్ నాని మళ్లీ దూకుడును పెంచేశారు. వరుస సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్‌లో నటిస్తున్న నాని

TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 13, 2020 | 1:59 PM

Nani next movie announced: నాచురల్‌ స్టార్ నాని మళ్లీ దూకుడును పెంచేశారు. వరుస సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్‌లో నటిస్తున్న నాని.. ఆ తరువాత టాక్సావాలా ఫేమ్‌ రాహుల్‌ సంక్రీత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్‌లో నటించనున్నారు. ఇక ఈ రెండింటి తరువాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు నాని. ప్రముఖ రచయిత, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించనున్నారు. (కరోనా లక్షణాలు చాలా ఇబ్బంది పెట్టాయి.. ఎవరో నా చెస్ట్‌పై అదిమి కూర్చునట్లు అనిపించేది)

ఈ విషయాన్ని ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ నవంబర్ 21న వస్తుందని, ఆలోగా దీపావళి గిఫ్ట్‌గా మూవీని ప్రకటించామని తెలిపింది. పోస్టర్‌లో వీణ, ఫ్లైట్‌, కెమెరా ఇలా పలు వస్తువులు ఉండగా.. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ మూవీలో నాని సరసన మలయాళ కుట్టీ నజ్రియా ఫాహద్‌ నటించనున్నారు. రాజా రాణి డబ్బింగ్‌తో తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకున్న నజ్రియా.. నాని మూవీ ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. (మేనకోడలితో ప్రభుదేవా రెండో వివాహం..!)

కాగా పవన్ సాధినేని తెరకెక్కించిన లవ్‌ ఇష్క్‌ కాదల్‌ మూవీకి కథను అందించిన వివేక్ ఆత్రేయ.. మెంటల్ మదిలో చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత బ్రోచేవారెవరురాను డైరెక్ట్ చేశారు. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించాయి. మరోవైపు మైత్రీ నిర్మాణ సంస్థలో నాని నటించే రెండో సినిమా ఇది కావడం విశేషం. (కరోనా అప్‌డేట్స్‌: దేశవ్యాప్తంగా 87లక్షలు దాటిన పాజిటివ్‌ కేసుల సంఖ్య.. కోలుకున్న 81లక్షల మంది)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu