Supreme Court: ఐఐటీల్లో ప్రవేశానికి ఇంటర్‌లో 75 శాతం మార్కులు ఉండాల్సిందేనా ?.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ?

ఇంటర్ అయిపోయాక చాలామంది విద్యార్థులు ఐఐటీలో చదవాలని కోరుకుంటారు. అందుకోసం ఇంటర్ ప్రారంభం నుంచే కోచింగ్‌లు తీసుకుంటూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అలాగే ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు కూడా పోటీపడుతుంటారు.

Supreme Court: ఐఐటీల్లో ప్రవేశానికి ఇంటర్‌లో 75 శాతం మార్కులు ఉండాల్సిందేనా ?..  సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ?
Supreme Court Of India
Follow us

|

Updated on: May 30, 2023 | 5:53 PM

ఇంటర్ అయిపోయాక చాలామంది విద్యార్థులు ఐఐటీలో చదవాలని కోరుకుంటారు. అందుకోసం ఇంటర్ ప్రారంభం నుంచే కోచింగ్‌లు తీసుకుంటూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అలాగే ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు కూడా పోటీపడుతుంటారు. అయితే ఇప్పటివరకు ఐఐటీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ పరీక్షల్లో 75 శాతం మార్కులు వచ్చి ఉండాలనే నిబంధన ఉండేది. ఇటీవల ఈ నిబంధనను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది.

తాజాగా ఈ పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 75 శాతం మార్కులు వచ్చి ఉండాలన్న నిబంధనను సవాలు చేస్తు దాఖలైన పిటీషన్‌ను కొట్టివేసింది. ఈ నిబంధన గతం నుంచే ఉందని.. ఇందులో జోక్యం చేసుకోలేమని జస్టీస్ సుధాంశు ధూలియా, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ తీర్పునిచ్చింది. ఎప్పటి నుంచో ఇదే నిబంధనను పాటిస్తున్నారని.. ఇప్పుడు దీంట్లో జోక్యం చేసుకోవడం ఎందుకని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..