Air India Flight: ఫ్లైట్లలో ఫైటింగ్ ఏందిరో..! ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడు హల్‌చల్..
ఇదిలా ఉంటే, ఇంతకు ముందు కూడా, ఏప్రిల్ నెలలో ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఏప్రిల్ 10వ తేదీన ఢిల్లీ-లండన్ విమానంలో ఓ ప్రయాణికుడు ఇద్దరు మహిళా క్యాబిన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఘటన జరిగిన తర్వాత నిందితుడిపై ఎయిర్‌లైన్స్ రెండేళ్లపాటు నిషేధం విధించింది.

ఇటీవలి కాలంలో విమానాల్లో అసభ్యంగా ప్రవర్తించే కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. మే 11న, ఢిల్లీ-కోల్‌కతా ఇండిగో విమానంలో మత్తులో ఉన్న మహిళా ప్రయాణికురాలు సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారు. ఎయిర్ ఇండియా విమానంలో సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మే 29న విమానం ఏఐ882లో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడని ఎయిర్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. నిందితుడైన ప్రయాణీకుడు సిబ్బందిని దుర్భాషలాడుతూ… వారిలో ఒకరిపై దాడి చేసినట్టుగా చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రెగ్యులేటర్‌కు కూడా సమాచారం అందించామని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ సూపర్‌వైజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు పంజాబ్‌కు చెందిన నిందితుడు జకీరత్ సింగ్ పెద్దా (25)పై కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే, ఇంతకు ముందు కూడా, ఏప్రిల్ నెలలో ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఏప్రిల్ 10వ తేదీన ఢిల్లీ-లండన్ విమానంలో ఓ ప్రయాణికుడు ఇద్దరు మహిళా క్యాబిన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఘటన జరిగిన తర్వాత నిందితుడిపై ఎయిర్‌లైన్స్ రెండేళ్లపాటు నిషేధం విధించింది.
నిందితుడిని కోల్‌కతా విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించారు. మీడియా నివేదికల ప్రకారం, ప్రయాణీకురాలి పేరు పరమజీత్ కౌర్‌గా గుర్తించారు. సిబ్బంది, తోటి ప్రయాణీకులు ఆమె మత్తులో ఉన్నట్లు గుర్తించారు. సిబ్బందితో పాటు ఇతర ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించాడు. విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత నిందితుడు ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..