Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి ఇష్టంలేదని ప్రియుడితో లేచిపోయిన వధువు.. కథ విషాదాంతం..ఏం జరిగిందంటే..

కానీ సరిగ్గా కొన్ని గంటలు ముందు పెళ్లి కూతురు కనపడడం లేదనే వార్త పెళ్లిమండపం అంత వ్యాపించింది. పెళ్ళికి ఇంకొన్ని గంటలు ఉందనగా పెళ్లి కూతురు ప్రియుడితో పారిపోయింది. కానీ, దురదృష్టవశాత్తు ఆమె ప్రేమకథ చివరకు విషాదాంతంగా మారింది.  ఊహించని సంఘటన ఆమెను..

పెళ్లి ఇష్టంలేదని ప్రియుడితో లేచిపోయిన వధువు.. కథ విషాదాంతం..ఏం జరిగిందంటే..
Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: May 30, 2023 | 5:05 PM

పెళ్లి మండపం సిద్ధంగా ఉంది. మరికాసేపట్లో పెళ్లి ముహూర్తం కూడా రాబోతుంది. కానీ సరిగ్గా కొన్ని గంటలు ముందు పెళ్లి కూతురు కనపడడం లేదనే వార్త పెళ్లిమండపం అంత వ్యాపించింది. పెళ్ళికి ఇంకొన్ని గంటలు ఉందనగా పెళ్లి కూతురు ప్రియుడితో పారిపోయింది. కానీ, దురదృష్టవశాత్తు ఆమె ప్రేమకథ చివరకు విషాదాంతంగా మారింది.  ఊహించని సంఘటన ఆమెను తిరిగి రాని లోకాలకు చేర్చింది. యూపీలోని మిర్జాపూర్‌లో జరిగిన విషాద సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మీర్జాపూర్ కు చెందిన ఓ యువతి పెళ్లికి ఒకరోజు ముందు ప్రేమికుడితో కలిసి పారిపోయింది. కానీ, ఆమెను మృత్యువు వెంటాడింది. ఊహించని ప్రమాదంలో యువతి మరణించింది.  ఆమె పారిపోవడానికి సహకరించిన బంధువు సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురూ కలిసి టూవీలర్‌పై ప్రయాణిస్తుండగా ట్రక్కు ఢీకొట్టింది. బైక్ వేగంగా వెళ్తుండగా రోడ్డు అవతలి వైపు నుంచి వస్తున్న లారీని ఢీకొట్టింది. మరణించిన వారు రాణి, కరణ్, వికాస్‌గా గుర్తించారు. మృతులు ముగ్గిరి వయస్సు 21ఏళ్లు మాత్రమే. మృతురాలికి యూపికి చెందిన ప్రయాగ్‌రాజ్‌కు చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయించారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఓ యువతి పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. పెళ్లికి ఒకరోజు ముందు వధువు తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగానే యువతి ప్రియుడు, వారి బంధువు, ఆ అమ్మాయి ఇంటికి చేరుకున్నారు. బంధువులను పక్కదారి పట్టించి ముగ్గురూ కలిసి మోటార్‌సైకిల్‌పై పరారయ్యారు. సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న వీరు ట్రక్కును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆమెను తప్పించుకునేందుకు సహకరించిన బంధువు సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మృతురాలికి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని తెలిసింది. ఆమె తన బంధువైన స్థానిక వ్యక్తిని ప్రేమిస్తున్నట్టుగా తెలిసింది. ఈ కారణంగానే యువతని తన ప్రియుడితో పారిపోవటానికి ప్రయత్నించి అనంతలోకాలకు వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..