Delhi liquor: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు.. అరుణ్ పిళ్లై ఆమె వ్యక్తేనంటూ..
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ మరోసారి కవిత పేరును ప్రస్తావించింది. మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కవిత పేరును ఈడీ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన..

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ మరోసారి కవిత పేరును ప్రస్తావించింది. మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కవిత పేరును ఈడీ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన వెనుక స్కామ్ ఉందని పేర్కొంది. సౌత్ గ్రూప్‌లో అరుణ్ పిళ్లై కీలక వ్యక్తి అంటూ వాదనలు వినిపించింది. కవితకు సంబంధించిన వ్యక్తిగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ చెప్పుకొచ్చింది. అలా ఆ లిక్కర్ దందాలో వచ్చిన లాభాలతోనే ఆస్తులు కొన్నారని వివరించింది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించి కవితతో కొన్ని మీటింగ్స్ కూడా జరిగాయని ఈడీ పేర్కొంది.
ఇక ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, ఆడిటర్ బుచ్చిబాబు హైదరాబాద్‌లో కొన్ని ప్రాపార్టీలు కొన్నారని ఈడీ చెప్పింది. మార్కెట్ ధర కంటే తక్కువ మొత్తం చెల్లించి కవిత ఆ భూములు కొన్నట్టు ఆరోపించింది. ఈ లిక్కర్ కేసులో కవిత పాత్రపై నోటీసులు ఇచ్చి ఇప్పటికే విచారణ జరిపామన్నారు. ఈ నేపథ్యంలో తమ వాదన వినిపించేందుకు సమయం కావాలని పిళ్లై తరపు న్యాయవాది కోర్టును కోరారు. విచారణ సందర్భంగా రొటీన్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారని ఓ దశలో న్యాయమూర్తి కామెంట్ చేశారు. చివరికి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..