AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aghora Puja Video: డెడ్ బాడీపై పద్మాసనం.. పొట్టపై కూర్చుని అఘోరా పూజలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

తమిళనాడులోని అఘోరా పూజలు కలకలం రేపాయి.. మరణించిన వ్యక్తిపై కూర్చుని అఘోరా పూజలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కోయంబత్తూలో జరిగిన ఈ సంఘటన భయాందోళనకు గురిచేసింది.

Aghora Puja Video: డెడ్ బాడీపై పద్మాసనం.. పొట్టపై కూర్చుని అఘోరా పూజలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Aghora Puja
Shaik Madar Saheb
|

Updated on: May 30, 2023 | 1:39 PM

Share

తమిళనాడులోని అఘోరా పూజలు కలకలం రేపాయి.. మరణించిన వ్యక్తిపై కూర్చుని అఘోరా పూజలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కోయంబత్తూలో జరిగిన ఈ సంఘటన భయాందోళనకు గురిచేసింది. తమిళనాడు కోయంబత్తూర్ జిల్లా సూళ్లూరులో సమీపంలోని మణికంఠన్, అతని భార్య ఉంటున్నారు.. అయితే, భార్యతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యతో విభేదాల కారణంగా మణికంఠన్ ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మణికంఠన్ కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని సూలూరుకి తీసుకువచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు..

సరిగ్గా అదే సమయంలో మణికంఠన్ స్నేహితులమంటూ కొంతమంది అఘోరాలు వచ్చారు. అతని ఆత్మశాంతి కోసం అఘోరాలు కొన్ని పూజలు చేయాలని చెప్పారు. అందుకు కుటుంబసభ్యలు ఓకే చెప్పడంతో మణికంఠన్ మృతదేహంపై కూర్చుని ధ్యానం చేస్తూ ఏవో మంత్రాలు చదువుతూ పూజలు చేశాడు ఓ అఘోరా.. మణికంఠ డెడ్ బాడీపై అఘోరా పద్మాసనం వేసుకుని కూర్చుని అతడు పెద్ద పెద్ద కేకలు వేస్తూ.. పూజలు చేస్తుంటే.. అతడి అనుచరులు ఢమరుకం వాయిస్తూ, శంఖం ఊదుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేశారు.

ఈ తతంగం అంతా చూసేవారిని భయభ్రాంతులకు గురి చేసింది. అయితే దీనిపై కొందరు ఆందోళన వ్యక్తం చేయగా.. మరికొందరు చనిపోయిన వ్యక్తిపై కూర్చుని ఈ పూజలేంటని అక్కడికి వచ్చిన వారు వింతగా చూశారు. చనిపోయిన ఫ్రెండ్‌ శవంపై కూర్చుని పూజలు ఏంటి?..అలా చేస్తే వారికి ఆత్మశాంతి కలుగుతుందా? కోయంబత్తూర్‌లో అఘోరా చేసిన పూజ సంచలనం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

అఘోరాలు చేసిన పని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. క్షుద్రపూజల తరహాలో అఘోరాలు శవంపై కూర్చుని పూజలు నిర్వహించటం ఢమరుకం వాయిస్తూ, శంఖం ఊదుతూ చేసిన పూజలు స్ధానికంగా సంచలనం సృష్టించాయి.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..