ప్రభుత్వ పాఠశాలలో బాత్రూమ్స్ కడుగుతున్న విద్యార్థులు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు
టెక్నాలజీ పరంగా ఓవైపు దేశం దూసుకుపోతుంది. విద్యాసంస్థల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ కొన్నిచోట్ల మాత్రం ఇంకా మార్పులు రావడం లేదు.
టెక్నాలజీ పరంగా ఓవైపు దేశం దూసుకుపోతుంది. విద్యాసంస్థల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ కొన్నిచోట్ల మాత్రం ఇంకా మార్పులు రావడం లేదు. ఇక ప్రభుత్వ పాఠాశాలలో పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. సరైన సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు టాయిలెట్స్ కడుగుతున్న వీడియోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తమిళనాడులోని కాంచీపురం, ఈరోడ్ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలలో ఈ ఘటనలు జరిగాయి. దీంతో ఆయా పాఠశాలల్లోని సంబంధించిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు నిరసనలు చేపట్టాయి.
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని అలపాక్కమ్ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థిని టాయిలెట్‌ను కడుగుతుండగా తీసిన వీడియో అలాగే ఈరోడ్ జిల్లాలోని పురుందురై ప్రభుత్వ స్కూల్లో పలువురు విద్యార్థులు టాయిలెట్ కడుగుతుండగా అక్కడున్న కొందరు వ్యక్తులు వీడియోలు తీశారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తో ఈ రెండు ఘటనల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు డీఈవోలను ఆదేశించారు. అయితే మొదటి వీడియోలో విద్యార్థిని దళిత వర్గం కావడంతో టీచర్ పుష్పావతి ఉద్దేశపూర్వకంగానే విద్యార్థినితో టాయిలెట్స్ శుభ్రం చేయించారని విచారణలో తేలింది. దీంతో టీచర్ని సస్పెండ్ చేసి వీడియోను ఎవరు తీశారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే ఈరోడ్ స్కూల్ ఘటనకు సంబంధించి పాఠశాల ఉపాద్యాయులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్నాపు అధికారులు. విచారణ పూర్తి అయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలని టీచర్ కలై సెల్వికి ఆదేశాలు జారీ చేశారు అధికారులు.
Also Read: Darja Teaser: దర్జా టీజర్ రిలీజ్.. చీరకట్టిన సివంగిగా మరోసారి అదరగొట్టిన అనసూయ..
Nagarjuna: శరవేగంగా ది ఘోస్ట్.. దుబాయ్‌లో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన నాగార్జున అండ్ టీం..
Swimming Benefits: స్విమ్మింగ్ చేస్తే బరువు తగ్గుతారా ?.. ఈ టిప్స్ ఫాలో అయితే ఖాయమంటున్న నిపుణులు..