AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranga Ranga Vaibavanga: రంగ రంగ వైభవంగా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..

ఉప్పెన సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించాడు యంగ్ హీరో వైష్ణ‌వ్ తేజ్ (Vaishnav Tej). మొదటి సినిమాతోనే తెలుగు

Ranga Ranga Vaibavanga: రంగ రంగ వైభవంగా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..
Ranga Ranga Vaibavanga
Rajitha Chanti
|

Updated on: Mar 31, 2022 | 6:39 AM

Share

ఉప్పెన సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించాడు యంగ్ హీరో వైష్ణ‌వ్ తేజ్ (Vaishnav Tej). మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఆ తర్వాత కొండాపొలం సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibavanga). ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గిరీశాయ ద‌ర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వైష్ణవ్ సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్‌. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మూవీకి సంబంధించిన అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జూలై 1 భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ డైరెక్షన్‌లో ల‌వ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిసిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ‘రంగ రంగ వైభ‌వంగా’ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుద‌లైన ఈ మూవీ టైటిల్ టీజ‌ర్‌, పాట‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాకు మేజ‌ర్ హైలైట్‌గా నిలుస్తుంది. శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Also Read: Fact Check: జక్కన్నను అన్‌ఫాలో చేసిన అలియా.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫొటోలు డిలీట్‌.. ఇందులో నిజమెంతంటే..

Pakka Commercial: గోపీచంద్‌ పక్కా కమర్షియల్‌ వచ్చేది అప్పుడే.. రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ మేకర్స్‌..

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించినందుకు గర్వంగా ఉంది.. తన కెరీర్‌ గురించి ఎన్టీఆర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. మరింత ఆలస్యం కానున్న సలార్‌ విడుదల.. కారణం ఇదేనా.?