Samantha: నెట్టింట్లో ట్రెండ్ అవుతోన్న మరో సరికొత్త ఛాలెంజ్.. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన సామ్..
Attack challenge: గతంలో ఐస్ బకెట్, రైస్ బకెట్ ఛాలెంజ్‌లు సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హెల్త్, ఫిట్‌నెస్, కుకింగ్‌లకు సంబంధించి ఎన్నో రకాల ఛాలెంజ్‌లను బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రతిపాదించారు

Attack challenge: గతంలో ఐస్ బకెట్, రైస్ బకెట్ ఛాలెంజ్‌లు సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హెల్త్, ఫిట్‌నెస్, కుకింగ్‌లకు సంబంధించి ఎన్నో రకాల ఛాలెంజ్‌లను బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రతిపాదించారు. అనంతరం తోటి నటీనటులు, సహచరులకు వాటిని పూర్తి చేయాలంటూ సవాళ్లు కూడా విసిరారు. అలా ఇప్పుడు నెట్టింట్లో మరొక ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. అదే అటాక్ ఛాలెంజ్ (Attack challenge).. ఇందులో ఏం చేయాలంటే జిమ్‌లో కఠిన కసరత్తులు, వ్యాయమాలు చేసి బాగా చెమటోడ్చాలి. అనంతరం వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇతరులకు సవాల్ విసరాలి. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై స్ఫూర్తి కలిగించే లక్ష్యంతో ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించింది టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). కాగా ఆమె జాన్ అబ్రహంతో కలిసి బాలీవుడ్‌లో అటాక్ అనే సినిమాలో నటిస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో కీలక పాత్రలో నటిస్తోంది.
కాగా అటాక్ సినిమా నేపథ్యంలోనే ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించింది పంజాబీ ముద్దుగుమ్మ. జిమ్‌లో వర్కవుట్లు చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ.. టైగర్‌ష్రాఫ్, జాక్వెలిన్‌లకు సవాలు విసిరింది. అనంతరం జాక్వెలిన్ జాన్‌అబ్రహం లక్ష్యరాజ్‌కు.. టైగర్‌ష్రాఫ్.. సమంత, జాకీ భగ్నానీకి ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయాలని నామినేట్ చేశారు. అలా టైగర్ నుంచి ఛాలెంజ్‌ను స్వీకరించిన సామ్.. ట్రైనర్ సమక్షంలో వెయిట్ లిఫ్టింగ్ సహా కఠిన వ్యాయామాలు, వర్కవుట్లు చేసింది. అనంతరం ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తనను నామినేట్ చేసిన టైగర్ ష్రాఫ్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఛాలెంజ్‌ను కొనసాగిస్తూ అర్జున్ కపూర్‌కు అటాక్ ఛాలెంజ్ విసిరింది. అయితే ఈ బాలీవుడ్ హీరో ‘నేను నీలా చేయలేను’ అంటూ కామెంట్ పెట్టాడు. అయితే సమంత వర్కవుట్ వీడియో మాత్రం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీటితో పాటు టైగర్‌ష్రాఫ్, రకుల్, జాక్వెలిన్ ల అటాక్ ఛాలెంజ్ వీడియోలు కూడా ఫిట్‌నెస్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా వీటిపై ఓ లుక్కేయండి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Dissent in SP: ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో మళ్లీ మొదలైన అధికార పోరు..!
RCB vs KKR, IPL 2022: ఫైర్ మీదున్న ఆర్‌సీబీ బౌలర్ హసరంగా.. కేకేఆర్ బ్యాటర్లపై నిప్పుల వర్షం..




