Diabetics Summer Care: పెరుగుతున్న ఎండలు.. షుగర్ పేషెంట్స్‌కి ప్రమాదం.. కీలక సూచనలు చేసిన వైద్యులు..!

Diabetics Summer Care: వేసవికాల ప్రభావం మొదలైంది. ఎండల తీవ్రత రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. మార్చిలోనే 41 డిగ్రీలు దాటిపోయింది.

Diabetics Summer Care: పెరుగుతున్న ఎండలు.. షుగర్ పేషెంట్స్‌కి ప్రమాదం.. కీలక సూచనలు చేసిన వైద్యులు..!
Summer Health
Follow us

|

Updated on: Mar 30, 2022 | 9:43 PM

Diabetics Summer Care: వేసవికాల ప్రభావం మొదలైంది. ఎండల తీవ్రత రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. మార్చిలోనే 41 డిగ్రీలు దాటిపోయింది. ఈ ఎండల కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలు తీవ్రంగా ప్రభావితం అవుతారని ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారు వేసవి కాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తుననారు. తీవ్రమైన ఎండల కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో నరాలు దెబ్బతింటాయని, తద్వారా తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనినే హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ అంటారని చెబుతున్నారు.

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో 20-79 మధ్య వయసున్న వారిలో మధుమేహం బారిన వారి సంఖ్య 74.2 మిలియన్లుగా ఉంది. 2045 నాటికి ఈ సంఖ్య 124.8 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇండియా డయాబెటిస్ (INDIAB) అధ్యయనం పట్టణ ప్రాంతాల్లో 10.9 శాతం నుంచి 14.2 శాతం మంది మధుమేహం బారిన పడినట్లు కేంద్ర ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 20 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాభాలో దీని ప్రభావం 3-7.8 శాతంగా ఉంది, 50 ఏళ్లు పైబడిన వ్యక్తులలో ఇది చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

కాగా, దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆ ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం కూల్ డ్రింక్స్, చల్లని పదార్థాలను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఇది మరింత ప్రమాదాన్ని తీసుకువస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు శీతల పానియాలు, స్వీట్ వస్తువులు అస్సలు తినొద్దని హెచ్చరిస్తున్నారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు కూల్ డ్రింక్స్ తాగితే.. జైన్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ ఫిజీషియన్ డాక్టర్ సోనుకుమార్ పూరి మాట్లాడుతూ.. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి తీపి పానీయాలు తాగకూడదని స్పష్టం చేశారు. ‘‘ఏదైనా తాగడం, తీపి పదార్థాలు తినడం చేయొద్దు. ఇది మరింత ప్రమాదకరం. శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. షుగర్ లెవల్స్ పెరిగితే.. మూత్రపిండాలు సహా అన్ని అవయవాలు దెబ్బతింటాయి. ఈ కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి.’’ అని డాక్టర్ స్పష్టం చేశారు.

మధుమేహ బాధితులపై ఎండల ప్రభావం ఎలా ఉంటుంది?.. మధుమేహ వ్యాధిగ్రస్తులపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ సోనుకుమార్ పూరి తెలిపారు. ‘‘అధిక ఉష్ణోగ్రతలు శరీరంలో షుగర్ లెవల్స్‌ని పెంచుతాయి. మధుమేహం వల్ల వచ్చే సమస్యలు నరాలను దెబ్బతీస్తాయి. ఇది చెమట గ్రంధులను మూసివేస్తాయి. ఫలితంగా చెమట పట్టదు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ఈ సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. ఇది అలసట, సన్ స్ట్రోక్‌(వడదెబ్బ)కు దారితీస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా మూత్రవిసర్జన చేయడం.. నిర్జలీకరణానికి కారణమవుతుంది. డీహైడ్రేషన్ కారణంగా చర్మానికి రక్త సరఫరాను తగ్గుతుంది. ఫలితంగా ఇంజెక్ట్ చేసిన ఇన్సులిన్‌ను గ్రహించే శరీర సామర్థ్యం తగ్గిపోతుంది.’’ అని చెప్పుకొచ్చారు.

వేసవి కాలంలో షుగర్ పేషెంట్స్ ఏం చేయాలి?.. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో మధుమేహం బాధితులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్ పూరి తెలిపారు. ‘‘వేసవి కాలంలో షుగర్ పేషెంట్స్ ఇంటికే పరిమితం అవడం ఉత్తమం. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లు తాగొచ్చు. నారింజ, ద్రాక్ష, పైనాపిల్, టొమాటో రసం, పొటాషియం పుష్కలంగా ఉండే కరేలా రసం, దోసకాయ రసం వంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లను తాగి హైడ్రేట్‌గా ఉండొచ్చు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పదార్థాలు కూడా తీసుకోవాలి.’’ అని సూచించారు.

డాక్టర్ వైశాలి వర్మ ప్రకారం.. ‘‘డయాబెటిక్ పేషెంట్స్.. ఆరోగ్యాన్ని, షుగర్ లెవల్స్‌ని అదుపులో ఉంచుకునేందుకు ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. నిమ్మరసం, ఉప్పు కలిపిన చల్లని నీరు, పూదీనా జ్యూస్, జల్టీరా జ్యూస్, తక్కువ కొవ్వు ఉన్న పాలు, దోసకాయ వంటి కూరగాయలు, యాపిల్ జ్యూస్ వంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు, పదార్థాలను తీసుకోవచ్చు.’’ అని తెలిపారు.

చక్కెర కోరికలు ఎందుకు వస్తాయి? ఇది చక్కెర కోసం కోరిక కాదు. ‘‘డయాబెటిక్ పేషెంట్ డీహైడ్రేట్ అయినప్పుడు దాహం వేస్తుంది. ఆ సమయంలో తీపి పదార్థాలు తినాలని అనిపిస్తుంటుంది. వాస్తవానికి వారికి కావలసింది ఎలక్ట్రోలైట్‌లు. అలాంటి సందర్భంలో ఫ్రూట్ సలాడ్, ఖర్జూరం తినొచ్చు. లేదా కొన్ని ఎండు ద్రాక్షలు తింటే మంచిది. అన్నింటికంటే ముఖ్యంగా మంచి నీరు తాగడం ఉత్తమం. మధుమేహం బాధితులు హైడ్రేట్‌గా ఉన్నంత కాలం తీపి పదార్థాలు తినాలనే కోరిక వారలో కలుగదు.’’ అని డాక్టర్ వైశాలీ వర్మ తెలిపారు.

డయాబెటిక్ డీహైడ్రేషన్‌కు గురైతే? ‘‘మధుమేహం బాధితులు డీహేడ్రేట్ అయితే.. బేల్ షర్బత్(వెలగపండు జ్యూస్) తాగవచ్చు. అది వారిని కూల్ చేస్తుంది. అలాగే పుచ్చపండును కూడా మితంగా తినొచ్చు. పుచ్చపండు జ్యూస్ మాత్రం తాగొద్దు. శరీరంలో షుగర్ లెవల్స్‌ని బట్టి పుచ్చపండును తినాలి.’’ అని డాక్టర్ వైశాలీ వర్మ తెలిపారు.

Also read:

Viral Video: ఈ పిల్లికి అతీంద్ర శక్తులేమైనా ఉన్నాయా ఏంటి.. వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

Astro Tips: కొబ్బరికాయతో ఇలా చేస్తే జీవితంలో సమస్యలన్నీ అధిగమించొచ్చు..!

GHMC: ఓవైసీ హాస్పిటల్ జంక్షన్‌కు అబ్దుల్ కలాం పేరు.. 10 కీలక అంశాలకు GHMC స్టాండింగ్ కమిటీ ఆమోదం

Latest Articles
ఏ విటమిన్‌ లోపిస్తే థైరాయిడ్‌ సమస్యలు దాడి చేస్తాయో తెలుసా?
ఏ విటమిన్‌ లోపిస్తే థైరాయిడ్‌ సమస్యలు దాడి చేస్తాయో తెలుసా?
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
ఎట్టకేలకు చిక్కిన సీరియల్ కిల్లర్.. హత్యల లిస్టుతో పోలీసుల షాక్!
ఎట్టకేలకు చిక్కిన సీరియల్ కిల్లర్.. హత్యల లిస్టుతో పోలీసుల షాక్!
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!
T20 ప్రపంచకప్‌ కోసం సూర్య సన్నాహాలు.. మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి
T20 ప్రపంచకప్‌ కోసం సూర్య సన్నాహాలు.. మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి
అరే ఏంట్రా ఇది.. యంగ్ హీరో బాడీ మీద ఇలాంటి గేమ్సా.. ?
అరే ఏంట్రా ఇది.. యంగ్ హీరో బాడీ మీద ఇలాంటి గేమ్సా.. ?
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం