Hair Care Tips: వేసవిలో జట్టు, చుండ్రు సమస్యలకు ఇలా చెక్ పెట్టండి.. సహజమైన పదార్థాలతో..
Hair Care Tips in Summer: వేసవికాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో జుట్టుపై శ్రద్ధ, శుభ్రత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా వేసవిలో
Hair Care Tips in Summer: వేసవికాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో జుట్టుపై శ్రద్ధ, శుభ్రత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా వేసవిలో జుట్టు సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఈ సీజన్‌లో వేడి, చెమట కారణంగా జుట్టు జిడ్డుగా మారుతుంది. హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాల కారణంగా జుట్టు నిర్జీవంగా, పొడిగా మారుతుంది. ఈ సీజన్‌లో జుట్టు రాలే సమస్యతోపాటు చుండ్రు అధికమవుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు కోసం అనేక ఇంటి చిట్కాలను అనుసరించవచ్చు. మీరు ఇంట్లో తయారుచేసిన అనేక రకాల హెయిర్ మాస్క్‌లను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఈ హెయిర్ మాస్క్‌లను సహజసిద్ధమైన పదార్థాలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
జిడ్డుగల జుట్టు కోసం ముల్తానీ మిట్టి, ఉసిరి, షికాకాయ్ హెయిర్ మాస్క్: దీని కోసం మీకు రెండు టేబుల్ స్పూన్ల కుంకుడుకాయల పొడి, రెండు టేబుల్ స్పూన్ల షికాకాయ్ పొడి, రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి, కరివేపాకు రసం, నిమ్మకాయ రసం అవసరం. ఈ పదార్థాలన్నింటినీ మిక్స్ చేసి హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి. దీన్ని జట్టుకు పట్టించి 40 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇది చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది. శికాకాయ్‌లో జుట్టును శుభ్రపరిచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. షికాకాయ్ పౌడర్‌లో విటమిన్ ఎ, కె, సి, డి పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
పొడి జుట్టు కోసం రోజ్ వాటర్ హెయిర్ మాస్క్: రోజ్ వాటర్‌తో మీ తలకు మసాజ్ చేయండి. పొడి జుట్టుకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
చిట్లిన జుట్టు కోసం మాస్క్: దీని కోసం మీకు 1 అరటిపండు, 4 టేబుల్ స్పూన్ల పెరుగు, 1-2 టేబుల్ స్పూన్ల తేనె అవసరం. అరటిపండును మెత్తగా చేసి అందులో పెరుగు, తేనె కలపండి. దానిని మెత్తగా చేసి.. జట్టు చివరి వరకు పట్టించాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు అలాగే ఉంచి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
మెరిసే, మృదువైన జుట్టు కోసం ఆలివ్ ఆయిల్ – తేనె హెయిర్ మాస్క్: దీని కోసం 4 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, 4 టేబుల్ స్పూన్ల తేనె అవసరం. ఆలివ్ ఆయిల్ – తేనె కలిపి పొడి జుట్టుకు పట్టించి మసాజ్ చేయండి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు అలాగే ఉంచి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
పొడి జుట్టు కోసం అవోకాడో – కొబ్బరి నూనె హెయిర్ మాస్క్: దీని కోసం మీకు 2 టేబుల్ స్పూన్ల అవకాడో రసం, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల తేనె అవసరం. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపి జట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. 20 నిమిషాల పాటు ఉంచి షాంపూతో శుభ్రం చేసుకోండి.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం ఆరోగ్య నిపుణుల సూచనలు మాత్రమే.. సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది. TV9 తెలుగు వీటిని ధృవీకరించడంలేదు)
Also Read: