Andhra Pradesh: కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలనుకున్నారు.. మధ్యలో ఊహించని ట్విస్ట్.. దెబ్బకు ఫ్యూజులు ఔట్..!
Andhra Pradesh: కొడితే ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలనుకున్నారు. ఇంకేముంది.. బ్యాంక్‌కు గురి పెట్టారు. ఇదే సరైనదని భావించి బ్యాంకుకు
Andhra Pradesh: కొడితే ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలనుకున్నారు. ఇంకేముంది.. బ్యాంక్‌కు గురి పెట్టారు. ఇదే సరైనదని భావించి బ్యాంకుకు కన్నం వేయాలనుకున్నారు. గుంటూరు నగరంలోని బ్యాంక్ లు అయితే భద్రతా ఏర్పాట్లు అధికంగా ఉంటాయని భావించి, మండల కేంద్రంలో ఉన్న బ్యాంక్ పై కన్నేశారు. దోపిడీ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారు. చివరి సమయంలో అలారం మ్రోగడంతో అక్కడ నుండి పరారయ్యారు.
వివరాల్లోకెళితే.. గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం సొలస రోడ్డులో ఎస్బిఐ బ్యాంక్ ఉంది. గత అర్థరాత్రి బ్యాంక్ లో చోరికి విఫలయత్నం జరిగింది. కిటికి తొలగించి బ్యాంక్ లో దొంగల ముఠా వెళ్ళింది. కిటికి తొలగించేందుకు గ్యాస్ కట్టర్ ను ఉపయోగించారు దొంగలు. కిటికీ తొలగించి లోపలికి అడుగు పెట్టి.. అంతా సవ్యంగానే ఉందనుకున్నారు. అయితే కొద్దిసేపటికే అలారం మ్రోగటం ప్రారంభమైంది. వెంటనే అప్రమత్తమైన దొంగలు చోరి చేయకుండానే అక్కడ నుండి జారుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో హూటాహుటిన బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. దొంగలు బ్యాంకులో ప్రవేశించి విధానాన్ని పరిశీలించారు. పక్కా స్కెచ్ తోనే దొంగలు బ్యాంక్ లోకి అడుగుపెట్టినట్లు నిర్ధారించుకున్నారు. అలారం మ్రోగకుంటే అందిన కాడికి ఎత్తుకెళ్ళే వాళ్ళని, మరిన్ని భద్రతా ఏర్పాట్లు తీసుకోవాలని బ్యాంకు అధికారులకు పోలీసులు సూచించారు.
Also read:
Viral Video: ఈ పిల్లికి అతీంద్ర శక్తులేమైనా ఉన్నాయా ఏంటి.. వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!
Astro Tips: కొబ్బరికాయతో ఇలా చేస్తే జీవితంలో సమస్యలన్నీ అధిగమించొచ్చు..!
GHMC: ఓవైసీ హాస్పిటల్ జంక్షన్‌కు అబ్దుల్ కలాం పేరు.. 10 కీలక అంశాలకు GHMC స్టాండింగ్ కమిటీ ఆమోదం