Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: వేసవిలో మొటిమలు, జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. శ్రీ గంధంతో ఇలా చెక్ పెట్టండి..

ఈ సీజన్‌లో చర్మ సంరక్షణకు చందనాన్ని(Sandal) ఉపయోగించడం ఉత్తమం అని చెప్పవచ్చు. శతాబ్దాలుగా చర్మ సంరక్షణ ఉత్పత్తులలో చందనాన్ని ఉపయోగిస్తున్నారు.

Skin Care Tips: వేసవిలో మొటిమలు, జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. శ్రీ గంధంతో ఇలా చెక్ పెట్టండి..
Sandalwood Pack
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 01, 2022 | 6:39 AM

వేసవి(Summer) వచ్చిందంటే మండే ఎండలు, హానికరమైన సూర్య కిరణాలు చర్మాన్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాయి. ఈ సీజన్‌లో తీక్షణమైన సూర్యకాంతి, వేడి గాలులు చర్మాన్ని నల్లగా మార్చేస్తాయి. దీని కారణంగా చర్మంపై ట్యాన్ వస్తుంది. వేడిలో మనకు పదే పదే చెమట పడుతుంది. మనం దానిని తుడుచుకుంటూ ఉంటాము. దీని కారణంగా కొన్నిసార్లు చర్మం కూడా రఫ్ గా మారుతుంది. సూర్యకాంతితో ముఖంలో మెరుపు తగ్గతుంది.. ఛాయను మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో చర్మంపై శ్రద్ధ వహించకపోతే అప్పుడు చర్మ సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్‌లో చర్మ సంరక్షణకు చందనాన్ని(Sandal) ఉపయోగించడం ఉత్తమం అని చెప్పవచ్చు. శతాబ్దాలుగా చర్మ సంరక్షణ ఉత్పత్తులలో చందనాన్ని ఉపయోగిస్తున్నారు.

చందనం ప్రయోజనాలు : చందనం సువాసన చాలా మంచిది . దాని ప్రయోజనాలు కూడా అపారమైనవి. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మంపై వచ్చే చెమట వాసన పోతుంది. గంధం ప్యాక్ చర్మంపై వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. చర్మంపై దురద నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ మొటిమలు.. అలెర్జీలకు అద్భుతమైన చికిత్స. ఆయుర్వేదం ప్రకారం గంధం ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. దీని కారణంగా చర్మం సమస్యలకు మాత్రమే కాకుండా అనేక సమస్యలను నయం చేయవచ్చు.

గంధం అంటే ఏమిటి: గంధం అనేది శ్రీగంధం చెట్టు నుంచి తీస్తారు. దీని శాస్త్రీయ నామం సంతలం ఆల్బమ్ గా వ్యవహరిస్తుంటారు. దీని చెక్కను శిల్పాలు, ఫర్నిచర్, గృహోపకరణాలు, హవనాలు, ధూప కర్రల తయారీకి ఉపయోగిస్తారు. చందనంతో పాటు దాని నూనెను సుగంధ ద్రవ్యాలు, అరోమాథెరపీకి కూడా ఉపయోగిస్తారు.

గంధంలోని ఔషధ గుణాలు: చందనంలోని ఔషధ గుణాల గురించి చెప్పాలంటే, ఇందులో యాంటీపైరేటిక్, యాంటిసెప్టిక్ , యాంటిస్కెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి బ్రాంకైటిస్, సిస్టిటిస్, డైసూరియా .. మూత్ర నాళాల వ్యాధులను సమర్థవంతంగా చికిత్స చేస్తాయి. వేసవిలో చర్మ సమస్యలకు చందనాన్ని ఉపయోగించడం ఉత్తమం. వేసవిలో చందనం ప్యాక్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

కావలసినవి: శ్రీ గంధపు పొడి, కర్పూరం , రోజ్ వాటర్

ప్యాక్ తయారు చేసే విధానం: చందనం ప్యాక్ చేయడానికి ముందుగా గంధపు పొడిని తీసుకోవాలి. మీరు ఒక గిన్నెలో 5 నుంచి 10 గ్రాముల చందనం పొడిని వేయండి. దానికి 2-3 గ్రాముల కర్పూరం పొడి వేసి రెండు టీస్పూన్ల రోజ్ వాటర్ కూడా కలపండి. అన్నింటినీ బాగా కలపండి. మందపాటి పేస్ట్ చేయండి. ఈ ప్యాక్‌ను ముఖం నుంచి మెడ వరకు 15 నిమిషాల పాటు అప్లై చేయండి. ప్యాక్‌ని 15 నిమిషాల పాటు ఆరిన తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్‌ని వారానికి రెండుసార్లు ఉపయోగించడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది. ముఖం చల్లగా ఉంటుంది. మీకు మొటిమల సమస్య ఉన్నప్పటికీ, మీరు ఈ ప్యాక్‌ను అప్లై చేయవచ్చు, ఎందుకంటే ఇది మొటిమలకు సమర్థవంతమైన చికిత్స.

ఇవి కూడా చదవండి: Gold Coins: పొలంలో బంగారు నిధి.. మరో మహిళతో రవితేజ జంప్.. ఇదో గోల్డ్ కాయిన్ మిస్టరీ..

Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. కన్నడ భక్తుడిపై హోటల్ యజమాని దాడి.. ఘర్షణ..

ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..