AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Coins: పొలంలో బంగారు నిధి.. మరో మహిళతో రవితేజ జంప్.. ఇదో గోల్డ్ కాయిన్ మిస్టరీ..

పొలంలో బంగారు కాయిన్లు.. అక్కడ నిధి ఉందా? అంతకుమించి ఇంకేమైనా ఉందా? తవ్వకాలు, పూనకాల మాటేమో గానీ సోషల్ మీడియా పుణ్యమాని జోరుగా ప్రచారం జరిగింది. ఫైనల్‌గా ఖాకీలు కూడా ఎంట్రీ ఇచ్చారు. మరి తేల్చిందేంటి?

Gold Coins: పొలంలో బంగారు నిధి.. మరో మహిళతో రవితేజ జంప్.. ఇదో గోల్డ్ కాయిన్ మిస్టరీ..
Gold Coins
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 31, 2022 | 7:11 AM

పురాతన కాలం నాటి కాయిన్(Gold Coins). ఇది బంగారమా? వెండా? ఇంకేదైనా లోహమా? మ్యాటర్‌ ఏంటో తెలియదు. కానీ చిత్తూరు జిల్లాలో(Chittoor District) బంగారు నిధి ఉందనే ప్రచారం మాత్రం జోరందుకుంది. సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేయడంతో అధికార యంత్రాంగం మొత్తం అలర్టయింది. శ్రీకాళహస్తి రూరల్ మండలం ఎంపేడు ఈశ్వరయ్య కాలనీలో ఎక్కడ చూసినా బంగారు నాణాల చర్చే నడుస్తోంది. ఐదు రోజుల క్రితం గ్రామానికి చెందిన రవితేజ మరో మహిళతో కలిసి ఊళ్లోంచి వెళ్లిపోయాడు. అదే సమయంలో అతని పొలంలో గోల్డ్ కాయిన్స్ దొరికాయన్న ప్రచారం ఊపందుకుంది. ఆనోటా ఈనోటా బంగారు నాణేల ప్రచారం పోలీసుల చెవిన పడింది. దీంతో గ్రామస్తులందర్నీ విచారించారు. బంగారు నాణేలను స్వాధీనం చేసుకుని టెస్ట్‌లకు పంపించారు.

రెవెన్యూ అధికారులు కూడా ఈ వ్యవహారంపై కూపీ లాగారు. గోల్డా, సిల్వరా అన్నది పక్కన పెడితే మరింత లోతుగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపేడు ఈశ్వరయ్య కాలనీ వాసులు మాత్రం బంగారు నాణేల ప్రచారాన్ని ఖండించారు. ఊళ్లోంచి పారిపోయిన రవితేజను తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రమేనని స్పష్టం చేశారు.

ఊళ్లో సంగతి ఎలా ఉన్నా.. నకిలీ నాణాలను వైరల్‌ చేయడం వెనుకున్న కథేంటో తేల్చేపనిలో పడ్డారు పోలీసులు. నకిలీ బంగారు నాణేలతో మోసాలకు పాల్పడే ముఠా పనేనన్న కోణంలో ఆరాతీస్తున్నారు. ఇదే కాలనీకి చెందిన అంజీ అండ్ కో గతంలో ఇలాంటి మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. అలాగే బంగారు నిధి దొరికిందన్న ప్రచారాన్ని కూడా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

వేర్వేరు కోణాల్లో కూపీ లాగుతున్నారు. మరోవైపు రవితేజ దొరికితే మరిన్ని నిజాలు బయటికొస్తాయని భావిస్తున్నారు. మొత్తానికి బంగారు నిధి ప్రచారంతో ఎంపేడు ఈశ్వరయ్య కాలనీ టాక్‌ ఆఫ్ ది స్టేట్‌గా మారిపోయింది.

ఇవి కూడా చదవండి: Birbhum Violence: బీర్భూమ్ హింసాకాండపై బీజేపీ నివేదిక.. సంచలన వ్యాఖ్యలు చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ