Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. భక్తుడిపై హోటల్ యజమాని దాడి.. ఘర్షణ..
శ్రీశైలంలో భయానక వాతావరణం ఏర్పడింది. ఆలయ పరిసరాల్లో కన్నడ భక్తులు వీరంగం సృష్టించారు. ఆలయ పరిసరాల్లో దుకాణాలు, వాహనాలు ధ్వంసం చేశారు. దేవాలయం పరిధిలోని తాత్కాలిక షాపులను ద్వంసం చేసి..
ఇద్దరి వ్యక్తుల మధ్య టీ కొట్టు దగ్గర మొదలైన గొడవ… విధ్వంసానికి దారి తీసింది. శ్రీశైల క్షేత్రంలో(Srisailam) అర్ధరాత్రి భయానక వాతావరణం ఏర్పడింది. ఆలయ పరిసరాల్లో వీరంగం సృష్టించారు కన్నడ భక్తులు. దేవాలయం పరిధిలోని తాత్కాలిక షాపులను ద్వంసం చేసి.. నిప్పు పెట్టారు. సుమారు 100పైగా దుకాణాలను ధ్వంసం చేశారు కన్నడ భక్తులు. 30 కార్ల అద్దాలను పగలకొట్టారు. 10 బైక్ లు ధ్వంసం చేశారు. శ్రీశైలం పుర వీధుల్లో విధ్వంసం సృష్టించారు. దీంతో ఒక్కసారి భక్తులు భయంతో పరుగులు తీశారు. అయితే అర్థరాత్రి సమయంలో టీ షాప్ నిర్వాహకుడికి కన్నడ భక్తులకు మధ్య వాగ్వాదం ఈ విధ్వంసానికి దారితీసింది. కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడి చేశాడు టీ షాప్ నిర్వాహకుడు. దీంతో రగిలిపోయిన కన్నడిగులు విధ్వంసం సృష్టించారు. పాతాళ గంగ, నంది సర్కిల్, పరిపాలన భవనం ముందు లైన్లల్లోని, తాత్కాలిక షాపులను పూర్తిగా ద్వంసం చేశారు. అటు, గాయపడ్డ వ్యక్తిని సున్నిపెంట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడ్డ వ్యక్తిని జగద్గురు పీఠాదిపతి పరామర్శించారు. పరిస్థితిని గమనించిన ఈఓ లవన్న, జగద్గురువు పీఠాధిపతి, కర్ణాటక స్వామిజీలతో మాట్లాడి ప్రత్యేక పోలీస్ బృందాలతో పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు మోహరించారు.
భక్తుల విధ్వంసానికి సుమారు 30లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు. మరోవైపు శ్రీగిరిలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మహోత్సవాలకు భక్తులు లక్షల్లో తరలివస్తున్నారు. మహాక్షేత్రంలో నిన్న అర్థరాత్రి చోటుచేసుకున్న విద్వంసకర వాతావరణంతో భక్తులు ఆందోళన చెందారు.
ఇవి కూడా చదవండి: Birbhum Violence: బీర్భూమ్ హింసాకాండపై బీజేపీ నివేదిక.. సంచలన వ్యాఖ్యలు చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ