Nallamala Forest: నల్లమలలో మరో చిరుత మృతి.. పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన..

నల్లమల అడవుల్లో మరో చిరుతపులి(Leopard) మృతి చెందింది. కర్నూలు జిల్లాలోని బండిఆత్మకూరు మండలంలోని అడవిలో చిరుతపులి చనిపోయినట్లు ఫారెస్ట్ అధికారులు(Forest Officers) గుర్తించారు. పెద్దపులి, చిరుత పులికి మధ్య...

Nallamala Forest: నల్లమలలో మరో చిరుత మృతి.. పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన..
Cheeta
Follow us

|

Updated on: Mar 31, 2022 | 8:59 PM

నల్లమల అడవుల్లో మరో చిరుతపులి(Leopard) మృతి చెందింది. కర్నూలు జిల్లాలోని బండిఆత్మకూరు మండలంలోని అడవిలో చిరుతపులి చనిపోయినట్లు ఫారెస్ట్ అధికారులు(Forest Officers) గుర్తించారు. పెద్దపులి, చిరుత పులికి మధ్య జరిగిన ఘర్షణలో చిరుతపులి మరణించిందని అధికారులు తెలిపారు. మృతి చెందిన చిరుతను పోస్టు మార్టం నిర్వహించి దహనం(cremation) చేశారు. నల్లమలలో వరుసగా పులుల మరణాలతో అటవీశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో గిద్దలూరు-నంద్యాల ప్రధాన రహదారిపై ఓ చిరుతపులి మృత్యువాత పడింది. పచ్చర్ల సమీపంలో ప్రధాన రహదారిని దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందింది. మరో ఘటనలో బొగద టన్నెల్‌ వద్ద ఏడాదిన్నర ఆడ చిరుతపులి రైలు ఢీ కొని మృతి చెందిన ఘటన తెలిసిందే. నల్లమల ఘాట్‌ రోడ్డులో చిరుతలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. వాహనాలకు అడ్డువస్తుండటంతో అవి ప్రమాదాలకు గురవుతున్నాయి. శ్రీశైలం రోడ్డులోని తుమ్మలబైలు, రోళ్లపెంట బేస్‌ క్యాంపు, శ్రీశైలం ముఖ ద్వారం వద్ద చిరుతలు రోడ్డు దాటే క్రమంలో అధికంగా మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించారు.

నల్లమల అడవిలో నీటి కొరత కారణంగా చిరుతలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలు సాగిస్తున్నాయని, ఈ క్రమంలో రోడ్డు దాటుతూ మృత్యువాత పడుతున్నాయని వివరించారు. వేసవి ఆరంభంలో ఎండలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వన్యప్రాణులతో పాటు పెద్ద పులులకూ నీటి ఇబ్బందులు ఎదురు కానున్నాయి. నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు తదితర ఎన్నో జంతువులు ఉన్నాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంపై అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వన్యప్రాణుల దాహం తీర్చేందుకు చెక్‌డ్యాంలు, నీటి తొట్టెలు, కుంటలు, సాసర్‌ పిట్స్‌లను నిర్మించింది. వీటి నిర్వహణ కోసం వేసవి సీజన్‌లో లక్షల రూపాయలు ఖర్చు చేసి మొబైల్‌ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోంది. అయితే ప్రస్తుతం చెక్‌డ్యాంలలో నీరులేకపోవటంతో అవి చాలా చోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. దీంతో తాగునీరు లేకపోవడంతో జంతువులు పలు చోట్ల రోడ్లను దాటుతూ మృత్యువాత పడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. సంరక్షణ చర్యలపై దృష్టి సారించాలి: వేసవి కాలంలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ ప్రత్యామ్నాయ చర్యలపై సమగ్ర దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Also Read

Viral Video: పుష్ప సాంగ్‌కు స్టెప్పులేసి చింపాంజీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Afghanistan: గెడ్డంతో వస్తేనే గవర్నమెంటు ఆఫీసుల్లోకి ఎంట్రీ.. లేదంటే గెటౌట్.. ఇదేం పైత్యం సామి..

Yadadri Temple: యాదాద్రి కొండపైకి ఆ వాహనాలకు నో పర్మిషన్.. కీలక నిర్ణయం తీసుకున్న ఈవో..