Yadadri Temple: యాదాద్రి కొండపైకి ఆ వాహనాలకు నో పర్మిషన్.. కీలక నిర్ణయం తీసుకున్న ఈవో..

లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదాద్రి (Yadadri)లో స్వయంభూ మూర్తుల దర్శనాలు ప్రారంభం కావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. దీనికి అనుగుణంగానే సౌకర్యాలు కల్పించేందుకు టీఎస్ఆర్టీసీ (TSRTC) సమాయత్తమవుతోంది

Yadadri Temple: యాదాద్రి కొండపైకి ఆ వాహనాలకు నో పర్మిషన్.. కీలక నిర్ణయం తీసుకున్న ఈవో..
Yadadri Temple
Follow us
Basha Shek

|

Updated on: Mar 31, 2022 | 7:45 PM

లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదాద్రి (Yadadri)లో స్వయంభూ మూర్తుల దర్శనాలు ప్రారంభం కావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. దీనికి అనుగుణంగానే సౌకర్యాలు కల్పించేందుకు యాదాద్రి దేవస్థానం  సమాయత్తమవుతోంది.  కాగా యాదగిరిగుట్టకు భక్తులను చేరవేసేందుకు గాను యాదాద్రి దర్శిని(Yadadri darshini) పేరుతో 100 మినీ బస్సులను టీఎస్ఆర్టీసీ (TSRTC) అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి జిల్లా కేంద్రం నుంచి యాదాద్రి కొండకు ఈ బస్సులు నడవనున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌ సర్కిల్‌ నుంచి కూడా యాదగిరిగుట్టకు మినీ బస్సులు నడవనున్నాయి. కాగా రేపటి నుంచి (ఏప్రిల్‌1) నుంచి యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులను కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తరలించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. భక్తుల తరలింపునకు అయ్యే పూర్తి ఖర్చును దేవస్థానమే భరిస్తుందని ఈవో స్పష్టం చేశారు. కాగా యాదాద్రి క్షేత్రంలో త్వరలో స్వామి వారి నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు జోడు సేవలు ప్రారంభిస్తామన్నారు.

కాగా యాదాద్రి స్వామివారి నిత్య కైంకర్యాల స‌మ‌యాల‌ను దేవస్థానం ప్రకటించింది. అవెలా ఉన్నాయంటే..

*ఉదయం 4నుంచి 4.30 వరకు సుప్రభాతం *ఉదయం 4.30 నుంచి 5 వరకు బిందె తీర్థం, ఆరాధన *ఉదయం 5 నుంచి 5.30 వరకు బాలభోగం *ఉదయం 5.30 నుంచి 6 వరకు పుష్పాలంకరణ సేవ *ఉదయం 6నుంచి 7.30 వరకు సర్వ దర్శనం *ఉదయం 7.30 నుంచి 8.30 వరకు నిజాభిషేకం *ఉదయం 8.30 నుంచి 9 వరకు సహస్రనామార్చన *ఉదయం 9 నుంచి 10 వరకు బ్రేక్ దర్శనం *ఉదయం 10 నుంచి 11.45 వరకు సర్వదర్శనం *ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాజభోగం

Also Read:పేస్ కట్స్ తో సహా గుర్తుపట్టలేనట్టు మారిపోయిన తెలుగు ముద్దుగుమ్మ మీరా జాస్మిన్

RRR movie : కొససాగుతున్న వసూళ్ల వేట.. ఆరు రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఎంత వసూల్ చేసిందంటే..

LSG vs CSK, IPL 2022: ఆ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో చెన్నై బౌలర్‌.. మిస్టర్‌ కూల్‌ను ఊరిస్తోన్న మరో రికార్డు.. మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్‌..

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..