AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఛీ.. ఛీ.. పాడి ఆవుపై పైశాచికం.. తిట్టడానికి కూడా మాటలు రావట్లేదు కదరా..

ఛీ.. కొందరి మనుషులు ప్రవర్తన చూస్తుంటే.. తిట్టడానికి కూడా మాటలు రావడం లేదు. పశువులపై కూడా పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు క్రూరులు. సభ్యసమాజం తల దించుకునేలా దారుణాలకి తెగబడుతున్నారు.

Telangana: ఛీ.. ఛీ.. పాడి ఆవుపై పైశాచికం.. తిట్టడానికి కూడా మాటలు రావట్లేదు కదరా..
Rape On Cow
Ram Naramaneni
|

Updated on: Mar 31, 2022 | 7:28 PM

Share

ఎవరైనా తప్పుగా దిగజారి ప్రవర్తిస్తే ..  ‘ఛా.. వీడి కంటే పశువే నయం అంటాం’. అయితే ఇలాంటి పదం వాడితే పశువులను కూడా కించపరిచినట్లు అవుతుందేమో. అవును కొందరు ఉన్నాదుల ప్రవర్తన అంత అసహ్యం వేసేలా ఉంది. తాజాగా తెలంగాణలో పాడి ఆవుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.. కాదు.. కాదు క్రూరుడు.. నీచుడు. సభ్య సమాజం తల దించుకునే విధంగా ప్రవర్తించాడు. అతడు చేసిన పాపపు పనికి ఆ మూగ జీవి అశువులు బాసింది. ఈ దారుణ ఘటన నిర్మల్​ జిల్లా(nirmal district) లోకేశ్వరం మండలం(Lokeswaram Mandal) పిప్రి గ్రామం(pipri village)లో చోటుచేసుకుంది.  గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఈ క్రమంలో టైల్స్​ వేసేందుకు ఉత్తరప్రదేశ్​కు చెందిన విజయ్ (20) అనే యువకుడిని పనికి పిలిచాడు. రోజూ తన పని తాను చేసుకుపోతున్న విజయ్​.. మార్చి 29 రాత్రి క్రూరంగా ప్రవర్తించాడు. ఫూటుగా మద్యం సేవించి.. ఆ మత్తులో అక్కడే సంచరిస్తున్న ఆవును చూశాడు. ఆపై అతడి మనసులో దారుణ ఆలోచన మెదిలింది. సైకో కంటే దారుణంగా ఆలోచించాడు. నిర్మాణ దశలో ఉన్న ఇంటిలోని ఒక కిటికీకి ఆవును కట్టేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూగ జీవిపై దారుణంగా ప్రవర్తించాడు. అతడి ప్రవర్తనతో బిత్తరపోయిన ఆవు.. తప్పించుకునేందుకు యత్నించింది. ఈ క్రమంలో కిటికీకి కట్టేసిన తాడు.. ఆవు మెడకు గట్టిగా చుట్టుకోవడంతో ఊపిరాడక మృతి చెందింది.

పొద్దున్నే యజమాని వచ్చి చూడగా.. బయట ఆవు కనిపించలేదు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. అది విగత జీవిగా కనిపించింది. వెంటనే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరకున్న పోలీసులు..  రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ రైతు ఆవుకు హిందూ సంప్రదాయం ప్రకారం.. అత్యక్రియలు నిర్వహించాడు.

Also Read: Hyderabad: సంచలనం.. హైదరాబాద్‌లో డ్రగ్స్ వల్ల తొలి మరణం.. మరో 8 మంది..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ