Hyderabad: సంచలనం.. హైదరాబాద్‌లో డ్రగ్స్ వల్ల తొలి మరణం.. మరో 8 మంది..
బీ అలెర్ట్.. డ్రగ్స్ కేవలం మత్తు ఇవ్వడమే కాదు.. జీవితాలను చిత్తు చేస్తుంది. ప్రాణాలను కూడా తీస్తుంది. తాజాగా హైదరాబాద్‌లో డ్రగ్స్ వల్ల తొలి మరణం సంభవించింది.
Drugs: డ్రగ్స్ తీసుకుంటే బానిసలవ్వడం కాదు.. ఏకంగా చచ్చిపోతారు కూడా. అవును, డ్రగ్స్‌కు అలవాటు పడి చివరికి చావును కొనితెచ్చుకున్న తొలి మరణం హైదరాబాద్‌లో జరిగింది. ఇప్పటి వరకూ సరదా కోసం, కిక్కు కోసం, వ్యవసాన్ని వదిలించుకోలేక డ్రగ్స్‌కు తీసుకుంటున్న యువతను చూశాం. విన్నాం. కానీ.. ఇది అంతకుమించిన వార్త. హైదరాబాద్‌కు చెందిన ఓ బీటెక్ విద్యార్థి గోవా(Goa) వెళ్లాడు. అక్కడ ఫస్ట్ డ్రగ్స్ తీసుకున్నాడు. అది కాస్తా అలవాటుగా ఆపై వ్యసనంగా మారింది. డోస్ పెరిగే కొద్ది ప్రాణం మీదకొచ్చింది. చివరికి అస్వస్థతతో ఆస్పత్రి పాలై.. కేవలం వారం అంటే వారంలోనే ప్రాణం పోగొట్టుకున్నాడు. చనిపోయే ముందు ఆస్పత్రిలో ఆ విద్యార్థి విలవిల్లాడుతూ కనిపించాడు.మెదడులో స్ట్రోక్స్ వచ్చి చికిత్స పొందతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. డ్రగ్స్ వేళ్లూనుకున్నాయని ఇప్పటివరకూ చెప్పుకుంటున్న హైదరాబాద్‌లో ఇప్పుడు ఓ మరణం కూడా సంభవించడం సంచలనంగా మారింది. డ్రగ్స్ కోసమే గోవా వెళ్తున్న వాళ్లు కొందరు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న వాళ్లు ఇంకొందరు. ఈ రెండో రకం బ్యాచ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. చూశారుగా డ్రగ్స్ ఎంత ప్రమాదమే.. తస్మాత్ జాగ్రత్త.. టేస్ట్ ఎలా ఉంటుంది అనో, సరదా కోసమనో దాని జోలికి వెళ్లకండి. ఆపై అది మీ ప్రాణాలకే ముప్పు తెస్తుంది.
మరో సంచలన న్యూస్ ఏంటంటే… డ్రగ్స్ బారిన పడి మరో 8మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. వీళ్లంతా ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి మొత్తం 9మంది గోవాకు వెళ్లడం మొదలుపెట్టారు. వీళ్లలో నలుగురు బీటెక్ స్టూడెంట్స్ ఉంటే.. మరో ఐదుగురు డీజేలు. ఈ 9 మందిలో ఒకరు చనిపోగా.. 8మంది ప్రస్తుతం ట్రీట్‌మెంట్‌లో ఉన్నారు.
Also Read: Hyderabad Metro: సూపర్ సేవర్ కార్డు.. రూ.59తో రోజంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు