Bandi Sanjay Letter: ఆసరా పెన్షన్ల సంగతేంది.. సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ-భారతీయ జనతా పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ జోరందుకుంది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.
Bandi Sanjay Open Letter: తెలంగాణ(Telangana)లో అధికార టీఆర్ఎస్(TRS) పార్టీ-భారతీయ జనతా పార్టీ(BJP)ల మధ్య పొలిటికల్ ఫైట్ జోరందుకుంది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. టీఆర్ఎస్ నేతలు కేంద్ర సర్కార్‌ను టార్గెట్ చేస్తే.. బీజేపీ కేసీఆర్ సర్కార్ పాలనా తీరుపై విరుచుపడుతోంది. లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆసరా పెన్షన్ల విషయంలో కేసీఆర్(KCR) సర్కారు వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.
ఆసరా పెన్షన్ల వయో పరిమితిని 57ఏళ్లకు తగ్గిస్తామని 2018లో ఇచ్చిన హామీ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. 57 ఏళ్లు నిండిన అర్హులైన దాదాపు 11 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. 2018లో సర్కారు ఇచ్చిన హామీ అమలై ఉంటే.. అర్హులైన వారిలో ఒక్కొక్కరు రూ.78,624 మేర లబ్దిపొందే వారని చెప్పారు. ఈ బకాయిలను వెంటనే వారికి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించడమే తప్ప.. ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు మొదలు పెట్టపోవడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. దరఖాస్తుల స్వీకరణకు మార్గదర్శకాలు సైతం విడుదల చేయకపోవడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఒక కుటుంబానికి ఒకే ఆసరా పెన్షన్ మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం అన్యాయమనన్న ఆయన.. అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల దాదాపు 2 లక్షల మంది వృద్ధులు పెన్షన్కు నోచుకోవడం లేదని, ప్రభుత్వం తక్షణమే నూతన మార్గదర్శకాలు విడుదల చేసి బడ్జెట్లో కొత్త పెన్షన్లకు అవసరమైన నిధులు కేటాయించాలని బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Also…. BJP vs TMC: ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులకు మీరేం చేశారు.. కేంద్రాన్ని నిలదీసిన మమతా బెనర్జీ!