BJP vs TMC: ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులకు మీరేం చేశారు.. కేంద్రాన్ని నిలదీసిన మమతా బెనర్జీ!

భారతీయ జనతా పార్టీ.. తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

BJP vs TMC: ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులకు మీరేం చేశారు.. కేంద్రాన్ని నిలదీసిన మమతా బెనర్జీ!
Mamata Banerjee
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 31, 2022 | 5:54 PM

Mamata Benarjee Fire on BJP: భారతీయ జనతా పార్టీ(BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం(Union Government).. పశ్చిమ బెంగాల్‌(West Bengal)లోని తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం అడిగిన కొన్ని ప్రశ్నలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సమాధానమిచ్చారు. అంతకు ముందు యుద్ధంలో అతలాకుతలమైన ఉక్రెయిన్ నుంచి తమ దేశానికి తిరిగి వచ్చిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎలాంటి విద్యాపరమైన చర్యలు తీసుకుంటుందో చెప్పాలని బెంగాల్ సీఎం మమత కోరారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థుల పూర్తి సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) చీఫ్ విలేకరులతో మాట్లాడుతూ, ఉక్రెయిన్ నుండి తమ దేశానికి తిరిగి వచ్చిన పిల్లల కోసం ప్రభుత్వం చేసిన ప్రణాళికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన 17 వేల మంది భారతీయ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ప్రధానిని కోరతానని మమతా బెనర్జీ అన్నారు. వారి చదువు ఏమవుతుంది? ఈ విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపడం ప్రభుత్వ కర్తవ్యం కాదా? అని మమతా ప్రశ్నించారు.

మమతా బెనర్జీపై బెంగాల్ భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర తప్పుబట్టారు. ముఖ్యమంత్రి మమతా తన పరిమితిని దాటి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని రెచ్చగొడుతోందని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కూడా ఊహకందనిదని సువెందు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పదాలు భారతదేశానికి వ్యతిరేకంగా దౌత్యపరంగా ఉపయోగించవచ్చని వారికి తెలియదా? దీనివల్ల మన విదేశాంగ విధానం, అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయని ఆయన ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే, బెంగాల్ ముఖ్యమంత్రి ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాల్లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థుల చదువులో సహాయం చేయడానికి బెంగాల్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బెనర్జీ చెప్పారు. బెంగాల్‌కు తిరిగి వచ్చిన 400 మంది విద్యార్థులను ఆమె కలుసుకున్నారు. ఆ పిల్లల చదువుకు సంబంధించి బెంగాల్ ప్రభుత్వం ఉచిత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు.

Read Also…. AP High Court: నేర చరితులకు టీటీడీ పదవులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!