AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: రక్తమోడిన రహదారులు.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మిలటరీ జవాన్‌ సహా నలుగురు మృతి

బీహార్‌లో వేర్వేరు రెండు రోడ్డు ప్రమాదాల్లో ఓ BMP జవాన్‌తో సహా నలగురు ప్రాణాలు కోల్పోయారు.

Road Accident: రక్తమోడిన రహదారులు.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మిలటరీ జవాన్‌ సహా నలుగురు మృతి
Nellore Accident
Balaraju Goud
|

Updated on: Mar 31, 2022 | 5:15 PM

Share

Road Accident: బీహార్‌(Bihar)లో వేర్వేరు రెండు రోడ్డు ప్రమాదాల్లో ఓ పోలీసుతో సహా నలగురు ప్రాణాలు కోల్పోయారు. ఔరంగాబాద్ జిల్లా బరున్(Barun) పోలీస్ స్టేషన్ పరిధిలోని NH 2 GT రోడ్డులో బుధవారం ఉదయం అదుపుతప్పి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో బీహార్ మిలటరీ పోలీస్ ఫోర్స్ (BMP) జవాన్ మరణించాడు. బీహార్ మిలటరీ పోలీస్ (బీఎంపీ) జవాన్ అజయ్ కుమార్ జీటీ రోడ్డులో విధులు నిర్వహిస్తుండగా అదుపుతప్పి అతివేగంతో వస్తున్న ట్రక్కు అతడిని బలంగా ఢీకొట్టిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌతమ్ శరణ్ ఓమి తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అజయ్‌కుమార్‌ మృతి చెందాడని తెలిపారు. ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బరున్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా బీహార్‌కు చెందిన రోహ్తాస్జిల్లాలోని శివసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బమ్‌హౌర్ గేట్ సమీపంలో ఎన్‌హెచ్ 2పై బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ద్విచక్రవాహనదారులు, ఒక బాలిక మరణించారు. ఈ ప్రమాదాల్లో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

లారీ ఢీకొని ఒకరు మృతి, మరొకరికి గాయాలు ఈ ప్రమాదాల్లో మృతులంతా కైమూర్ జిల్లా వాసులేనని శివసాగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సుశాంత్ కుమార్ మండల్ తెలిపారు. బమ్‌హౌర్ గేట్ సమీపంలో జరిగిన మొదటి ఘటనలో అదుపుతప్పిన ట్రక్కు మోటార్‌సైకిల్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో, కైమూర్ జిల్లా కుద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని సక్రి గ్రామానికి చెందిన ఇంద్రావతి దేవి మరణించగా, గాయపడిన సురేంద్ర సదర్ ఆసుపత్రిలోని ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోగా పోలీసులు లారీని సీజ్ చేశారు.

మరో ప్రమాదంలో చిన్నారి సహా మహిళ మృతి రెండవ సంఘటన కూడా బమ్‌హౌర్ గేట్‌లోనే జరిగింది, దీనిలో ఒక మహిళ, మరొక మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఒక అమ్మాయిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మరణించారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను కైమూర్ జిల్లాలోని సోన్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోన్హాన్ గ్రామానికి చెందిన కిషన్ శర్మ భార్య అనికా దేవి, వారి రెండేళ్ల కుమార్తె ఆర్తి కుమారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో కిషన్ శర్మ తమ్ముడు బృహన్నన్ శర్మ తీవ్రంగా గాయపడగా, మెరుగైన చికిత్స కోసం వారణాసికి రిఫర్ చేశారు.

Read Also…. Hyderabad: సంచలనం.. హైదరాబాద్‌లతో డ్రగ్స్ వల్ల తొలి మరణం.. మరో 8 మంది..