AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati Crime: మరదలితో యువకుడి ప్రేమాయణం.. తట్టుకోలేని బావ ఏం చేశాడంటే.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు

మరదలు వేరో వ్యక్తిని ప్రేమించడాన్ని సహించలేకపోయాడు ఆ బావ. పెళ్లిచేసుకుందామనుకున్న తరుణంలో ఈ విషయం తెలిసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. పద్ధతి మార్చుకోవాలని సదరు యువకుడిని హెచ్చరించాడు....

Tirupati Crime: మరదలితో యువకుడి ప్రేమాయణం.. తట్టుకోలేని బావ ఏం చేశాడంటే.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు
crime news
Ganesh Mudavath
|

Updated on: Mar 31, 2022 | 5:20 PM

Share

మరదలు వేరో వ్యక్తిని ప్రేమించడాన్ని సహించలేకపోయాడు ఆ బావ. పెళ్లిచేసుకుందామనుకున్న తరుణంలో ఈ విషయం తెలిసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. పద్ధతి మార్చుకోవాలని సదరు యువకుడిని హెచ్చరించాడు. అయినప్పటికీ అతనిలో కోపం చల్లారలేదు. మరదలిని ప్రేమిస్తున్న యువకుడిని చంపేయాలని(Murder) నిర్ణయించుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం ఆ యువకుడిని పిలిపించి, మద్యం తాగించాడు. అనంతరం అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి తాడుతో గొంతు నులిమి చంపేశారు. అనంతరం ఆధారాలు దొరకకుండా మృతదేహంపై పెట్రోల్(Petrol) పోసి నిప్పంటించారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా కేవీపురం మండలంలోని వడ్డిపల్లి(Vaddipalli) గ్రామానికి చెందిన రెడ్డికుమార్‌ కార్పెంటర్‌ పనులు చేసుకుంటూ చంద్రగిరి సమీపంలో నివాసముంటున్నాడు. వడ్డిపల్లికి చెందిన ఇంటర్‌ చదువుతున్న అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని బాలిక మేనబావ నాగేంద్ర భావించాడు. రెడ్డికుమార్, బాలిక ప్రేమించుకుంటున్నారన్న విషయం తెలుసుకుని రెడ్డికుమార్‌ని హత్య చేయాలని పథకం పన్నాడు.

ఇదే సమయంలో రెడ్డికుమార్‌ తన స్నేహితులతో కలిసి తిరుపతిలో ఓ సినిమాకు వచ్చాడు. అదే రోజు సాయంత్రం నాగేంద్ర ఫోన్ చేసి, తిరుపతి బస్టాండ్ వద్దకు రావాలని పిలిచాడు. దీంతో రెడ్డి కుమార్ ఒంటరిగా నాగేంద్ర వద్దకు వెళ్లాడు. అనంతరం మరో వ్యక్తితో కలిసి సమీపంలోని బార్‌కు వెళ్లి, మద్యం కొన్నారు. మార్గమధ్యలోని పెట్రోల్ బంకులో లీటర్ పెట్రోలు తీసుకున్నారు.

ముగ్గురూ ద్విచక్ర వాహనంపై కరకంబాడి చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. అనంతరం వెంకటగిరికి బయలుదేరారు. మార్గమధ్యలోని ఏర్పేడు వద్ద వ్యాసాశ్రమం పక్కన ఉన్న అటవీ ప్రాంతంలోకి రెడ్డికుమార్‌ను తీసుకెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం నాగేంద్ర, ప్రతాప్‌ లు నైలాన్‌ తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

Also Read

Hyderabad: సంచలనం.. హైదరాబాద్‌లతో డ్రగ్స్ వల్ల తొలి మరణం.. మరో 8 మంది..

Pakistan Political Crisis: పాకిస్థాన్‌లో సుదీర్ఘకాలం పూర్తి చేసిన ప్రధానమంత్రి ఎవరో తెలుసా?

Diabetes: ఈ పదార్థాలు తీసుకుంటే డయాబెటిసే కాదు.. క్యాన్సర్‌ కూడా వస్తుంది..!