Pakistan Political Crisis: పాకిస్థాన్‌లో సుదీర్ఘకాలం పూర్తి చేసిన ప్రధానమంత్రి ఎవరో తెలుసా?
పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం పెరుగుతోంది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కుర్చీ ప్రమాదంలో పడింది. ఇమ్రాన్ ఖాన్ బుధవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత రాజీనామా చేస్తారని చర్చ జరిగింది.
Pakistan Political Crisis: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం పెరుగుతోంది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కుర్చీ ప్రమాదంలో పడింది. ఇమ్రాన్ ఖాన్(Imran Khan) బుధవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత రాజీనామా చేస్తారని చర్చ జరిగింది. కానీ అది జరగలేదు. చివరి బంతి వరకు పోరాడుతానని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. అయితే, ఇమ్రాన్ ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిత్రపక్షమైన MQM-P ద్వారా ఇమ్రాన్‌కు ఎదురు దెబ్బ తగిలినందున ఇబ్బందులు కూడా పెరిగాయి. ఇమ్రాన్ అనుకూల ఎంపీల సంఖ్య తగ్గుతోంది. గణాంకాల ప్రకారం అవిశ్వాస తీర్మానం తర్వాత ఇమ్రాన్ కుర్చీ తిగడం ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్థాన్ చరిత్రలో ఏ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేయలేదు. అటువంటి పరిస్థితిలో, పాకిస్తాన్‌లో ఎక్కువ కాలం పూర్తి చేసిన ప్రధానమంత్రులు ఎవరు, వారి గురించి తెలుసుకోవాలనే ప్రశ్న తలెత్తుతుంది. యూసుఫ్ రజా గిలానీ పాకిస్థాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి. అదే సమయంలో, లియాఖత్ అలీ ఖాన్ పాకిస్తాన్ మొదటి ప్రధాన మంత్రి.
పాకిస్థాన్‌లో సుదీర్ఘకాలం పూర్తిచేసిన ప్రధానమంత్రులు వీరేః
పేరు | పదవీకాలం | ప్రమాణస్వీకారం | రాజీనామా | రాజకీయ పార్టీ |
యూసుఫ్ రజా గిలానీ | 4 సంవత్సరాల 86 రోజులు | మార్చి 25, 2008 | జూన్ 19, 2012 | పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ |
లియాఖత్ అలీ ఖాన్ | 4 సంవత్సరాల 63 రోజులు | ఆగస్ట్ 14, 1947 | అక్టోబర్ 16, 1951 (హత్య) | ముస్లిం లీగ్ |
నవాజ్ షరీఫ్ | 4 సంవత్సరాల 53 రోజులు | జూన్ 05, 2013 | జూలై 28, 2017 | పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) |
జుల్ఫికర్ అలీ భుట్టో | 3 సంవత్సరాల 325 రోజులు | ఆగస్ట్ 14, 1973 | 05 జూలై 1977 | పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ |
ఇమ్రాన్ ఖాన్ | 3 సంవత్సరాల 223 రోజులు (31 మార్చి 2022 నాటికి) | ఆగస్ట్ 18, 2018 | , | పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ |
యూసుఫ్ రజా గిలానీ: అతను జూలై 9, 1952న జన్మించాడు. గిలానీ పాకిస్థాన్ 18వ ప్రధానమంత్రి. మార్చి 25, 2008న ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్థాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. గిలానీ ప్రస్తుతం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ఇది కాకుండా, అతను ఇంగ్లాండ్‌లోని చెషైర్ ఈస్ట్ కౌన్సిల్‌కు సలహాదారుగా కూడా పని చేశారు.
లియాఖత్ అలీ ఖాన్: న్యూస్ 9 నివేదిక ప్రకారం , పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి అయిన లియాఖత్ అలీని దేశ నాయకుడిగా కూడా పిలుస్తారు. 1947 ఆగస్టు 14న ప్రమాణ స్వీకారం చేశారు. అతను పాకిస్తాన్ మొదటి విదేశాంగ మంత్రి మరియు రక్షణ మంత్రి కూడా. అతను 1951 లో రావల్పిండిలో హత్యకు గురయ్యాడు. దీని మిస్టరీ నేటికీ ఛేదించలేదు.
నవాజ్ షరీఫ్: అతను 25 డిసెంబర్ 1949న జన్మించాడు. ప్రారంభ దశలో, అతను వృత్తిరీత్యా వ్యాపారవేత్త. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నవాజ్ షరీఫ్ మూడుసార్లు పాకిస్థాన్ ప్రధానిగా ఉన్నారు. 1990లో తొలిసారి, 1997లో రెండోసారి ఎన్నికయ్యారు. అదే సమయంలో, అతను 2013లో మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడు. కానీ తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయాడు. నవాజ్ అత్యధికంగా మూడోసారి ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు.
జుల్ఫికర్ అలీ భుట్టో: అతను జనవరి 5, 1928న జన్మించాడు. జుల్ఫికర్ అలీ 1973 నుండి 1977 వరకు పాకిస్థాన్ 9వ ప్రధానమంత్రిగా ఉన్నారు. అత్యధిక కాలం ప్రధాని పదవిని చేపట్టిన నాలుగో ప్రధానిగా ఆయన నిలిచారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వ్యవస్థాపకుడైన జుల్ఫికర్ 1971 నుంచి 1973 వరకు దేశ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
ఇమ్రాన్ ఖాన్: అక్టోబరు 5, 1952న జన్మించిన ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ నియాజీ కూడా క్రికెటర్. ఆయన పాకిస్థాన్ 22వ ప్రధానమంత్రి.
Read Also…. Man Living: 14 ఏళ్లుగా విమానాశ్రయాన్నే నివాసంగా మార్చుకున్న వృద్ధుడు.. అసలు కారణం తెలిస్తే షాక్!