AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shahbaz Sharif: పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.. ఎవరీ.. షాబాజ్ షరీఫ్?

పాక్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కుర్చీ దిగడం ఖాయమన్న విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానానికి ముందే ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి.

Shahbaz Sharif: పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.. ఎవరీ.. షాబాజ్ షరీఫ్?
Shahbaz Sharif
Balaraju Goud
|

Updated on: Mar 31, 2022 | 4:43 PM

Share

Shahbaz Sharif: పాకిస్తాన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌(Imraj Khan)కు కుర్చీ దిగడం ఖాయమన్న విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానానికి ముందే ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు . తన ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలో విదేశీ శక్తుల హస్తం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా పదవీకాలం దాదాపు 3 సంవత్సరాల 10 నెలలు గడిచింది. పదవీకాలం పూర్తికాకుండానే ప్రధానమంత్రి(Prime Minister) కుర్చీ దిగిపోవడం ఇదే మొదటిసారి కాదు. పాకిస్థాన్‌లో మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రులందరూ పదవీకాలం పూర్తి చేయలేకపోయారు.

అయితే పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా షాబాజ్ షరీఫ్ పేరు చర్చనీయాంశమైంది. ఆయనను పాకిస్తాన్ తదుపరి ప్రధాని అని పిలుస్తున్నారు. పాకిస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంలో పాక్ సైన్యం ఎలాంటి పక్షం వహించడం లేదని షాబాజ్ షరీఫ్ కొద్ది రోజుల క్రితం అన్నారు. షాబాజ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు. దీంతో ఆయన ఇంటి వద్ద కలకలం రేగినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు పీఎం ప్రోటోకాల్ ఇచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.

2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, షాబాజ్‌ను PML N ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) విజయం సాధించి ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యారు. ప్రతిపక్ష నేతగా షాబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

షహబాజ్ సమర్థవంతమైన నిర్వాహకుడిగా పేరు.. పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ నాయకుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ సమర్థవంతమైన పరిపాలనాదక్షుడిగా పేరు పొందారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన ఇమ్రాన్ ప్రభుత్వంపై పలు అంశాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అతను పంజాబ్ ప్రావిన్స్ (పాకిస్తాన్)కి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1997 ఫిబ్రవరిలో తొలిసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అక్టోబర్ 1999 వరకు సీఎంగా ఉన్నారు. దీని తరువాత, అతను జూన్ 2008 నుండి మార్చి 2013 వరకు రెండవసారి, తరువాత 2013 నుండి 2018 వరకు మూడవసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

1951లో లాహోర్‌లో జన్మించిన షాబాజ్ షరీఫ్ పూర్తి పేరు మియాన్ ముహమ్మద్ షాబాజ్ షరీఫ్. అతని తండ్రి పేరు మర్హూమ్ మియాన్ మహమ్మద్ షరీఫ్. అతని అన్నయ్య నవాజ్ షరీఫ్ కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పని చేశారు. అతను పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ చేత అనర్హుడుగా ప్రకటించడంతో అతను కూడా తన పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయాడు.

భారత్‌ నుంచి వచ్చి పాకిస్థాన్‌లో స్థిరపడ్డ కుటుంబం షాబాజ్ షరీఫ్ తండ్రి ముహమ్మద్ షరీఫ్ వ్యాపారవేత్త. అతని తల్లి పుల్వామా నివాసి. వ్యాపారం నిమిత్తం తరచూ కాశ్మీర్‌కు వెళ్లేవాడు. తరువాత అతని కుటుంబం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో స్థిరపడింది. బ్రిటీష్ రాజ్ నుండి స్వాతంత్ర్యం పొందిన సమయంలో 1947లో భారతదేశం పాకిస్తాన్ విభజించబడినప్పుడు, ముహమ్మద్ షరీఫ్ తన కుటుంబంతో లాహోర్‌లో స్థిరపడ్డారు. నవాజ్ షరీఫ్‌తో పాటు షాబాజ్‌కు మరో అన్నయ్య అబ్బాస్ షరీఫ్ కూడా ఉన్నారు. షాబాజ్ తన కజిన్‌ని 1973లో వివాహం చేసుకున్నాడు. అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు. 2003లో రెండో పెళ్లి చేసుకున్నాడు.

వ్యాపారవేత్తగా కెరీర్ ప్రారంభం షాబాజ్ షరీఫ్ లాహోర్ ప్రభుత్వ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత వ్యాపారవేత్తగా తన వృత్తిని ప్రారంభించాడు. అతను తన కుటుంబ వ్యాపారాన్ని చేపట్టాడు. 1985లో లాహోర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి అధ్యక్షుడయ్యాడు. అయితే ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 1987 88 మధ్య కాలంలో క్రియాశీలక రాజకీయాలను ప్రారంభించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అతను 1988 నుండి 1990 వరకు పంజాబ్ శాసనసభ సభ్యుడు, షాబాజ్ 1990 నుండి 1993 వరకు జాతీయ అసెంబ్లీ సభ్యుడు కూడా గెలుపొందారు.

మనీలాండరింగ్‌ కేసులో జైలుకు… షాబాజ్ షరీఫ్ కోట్లాది రూపాయల దుర్వినియోగం చేసి జైలుకు కూడా వెళ్లాడు. సెప్టెంబర్ 2020లో, మనీలాండరింగ్ కేసులో షాబాజ్ షరీఫ్‌ను NAB అరెస్టు చేసింది. నిరసనల కారణంగా రాజకీయ వైరంతో ఈ చర్య తీసుకున్నారని ఆయన పార్టీ ప్రభుత్వంపై ఆరోపించింది. అతని బెయిల్ అభ్యర్థనను లాహోర్ హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత అతన్ని కోర్టు గది నుండే అరెస్టు చేశారు. ఏప్రిల్ 2021 లో అతను లాహోర్ హైకోర్టు నుండి బెయిల్ పొందాడు. అయితే ఆయనపై ఈ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది.

Read Also…. Pakistan Political Crisis: పాకిస్థాన్‌లో సుదీర్ఘకాలం పూర్తి చేసిన ప్రధానమంత్రి ఎవరో తెలుసా?