AP High Court: నేర చరితులకు టీటీడీ పదవులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు!
నేర చరితులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో పదవులు ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
AP High Court on TTD: నేర చరితులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో పదవులు ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టిటిడి బోర్డు (TTD Borad) సభ్యులలో క్రిమినల్ కేసులు నమోదైన వున్నారని, ప్రత్యేక ఆహ్వానితులు ఎక్కువ మంది ఉన్నారని వేసిన పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. నేరచరిత్ర కలిగిన వారిని బోర్డు సభ్యులుగా నియమించడంపై హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి వాదనలు ఏప్రిల్ 19న వింటామని న్యాయస్థానం పేర్కొంది.
కాగా, వాయిదాపై పిటిషనర్ తరపు లాయర్ అశ్వనీకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు వివరాలను ధర్మాసనానికి అశ్వనీకుమార్ వివరించారు. నేరచరితుల్ని ఎలా నియమిస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అశ్వనీకుమార్ వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నాయని భావిస్తున్నామని, కనీసం కొంత మందినైనా తొలగించాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. అలాగే, టీటీడీ భవనం కలెక్టరేట్ అవసరాలకు వాడుకుంటే.. విధానపరమైన నిర్ణయం కాబట్టి సమర్థించామని కోర్టు తెలిపింది. కానీ నేరచరిత్ర ఉన్న సభ్యులు పాలకవర్గంలో ఉండొద్దని సూచించింది. కాగా, తదుపరి వాదనలు ఏప్రిల్ 19న వింటాం.. అదే రోజు నిర్ణయం కూడ తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపులు ఉండబోవని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 19వ తేదికి వాయిదా వేసింది ధర్మాసనం.
ఇదిలావుంటే, టీటీడీ నూతన బోర్డును నియమకానికి సంబంధించి గతేడాది రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా జీవోలు జారీచేసిన సంగతి తెలిసిందే. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండో సారి అవకాశం కల్పించిన జగన్ సర్కార్.. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నలుగురు అధికారులతో పాటు 24 మందిని సభ్యులుగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్‌కు అవకాశం కల్పించారు. వీరికి తోడు గతంలో ఎప్పుడూ లేనంతగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.
టీటీడీకి జంబో పాలకవర్గం ఏర్పాటు చేయడాన్ని తెలుగు దేశం పార్టీ సహా పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జగన్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించాయి. ఈ జీవోలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారించిన ఏపీ హైకోర్టు ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించిన జీవోను సస్పెండ్ చేసింది. మరోవైపు టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో నేర చరిత్ర ఉన్నవారిని నియమించారంటూ గత కొద్ది రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also… Edible Oil: సామాన్యులకు షాక్.. మరింత పెరగనున్న వంట నూనెల ధరలు..!