Diabetes: ఈ పదార్థాలు తీసుకుంటే డయాబెటిసే కాదు.. క్యాన్సర్ కూడా వస్తుంది..!
ఈ మధ్య చాలా మంది డయాబెటిస్(Diabetes) బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం జీవశైలి అని నిపుణులు చెబుతున్నారు. అలాగే తీసుకునే పదార్థాల వల్ల కూడా వ్యాధులు వస్తాయని వివరిస్తున్నారు.
ఈ మధ్య చాలా మంది డయాబెటిస్(Diabetes) బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం జీవశైలి అని నిపుణులు చెబుతున్నారు. అలాగే తీసుకునే పదార్థాల వల్ల కూడా వ్యాధులు వస్తాయని వివరిస్తున్నారు. పంచదార ఆరోగ్యానికి మంచిదికాదనడంతో డయాబెటిస్ పేషెంట్లతో సహా ఇతరులు కూడా కృత్రిమ స్వీటెనర్లను కాఫీ, టీ లలో కలుపుకుని తాగుతున్నారు. కృత్రిమ స్వీటెనర్లతో తయారు చేసిన టీ(Tea), కాఫీ, ఇతర పానీయాలను తాగడం వల్ల ఒంట్లో చక్కెర నిల్వలు పెరిగే అవకాశం చాలా తక్కువ. అలాగే కేలరీలు కూడా బాగా ఖర్చువుతాయి. ఈ కారణంగానే చాలా మంది ఈ కృత్రిమ స్వీటెనర్లను( ) అధిక మొత్తంలో తీసుకుంటున్నారు.
కానీ ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ కృత్రిమ స్వీటెనర్లతో భవిష్యత్తులో డయాబెటీస్ బారిన పడే అవకాశముందని తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ కృత్రిమ స్వీటెనర్లను అధికంగా వాడటం వల్ల ప్రమాదరకమైన క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయంట. ఈ విషయాలు అంతర్జాతీయ మ్యాగజైన్లో పబ్లిష్ కూడా అయింది.
ఈ విషయంపై 2009 నుంచి అధ్యయనం కొనసాగుతూనే ఉంది. తాజా అధ్యయానంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 102,865 మందిపై ఈ అధ్యయనం చేశారు. వీరంతా స్వచ్ఛందంగా పాల్గొన్నవారేనట. వీరు వారి లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారం, చేసే పనులు, మెడికల్ హిస్టరీ వంటి సమాచారాన్నంత ఫ్రెంచ్ శాస్తవేత్తలకు తెలియజేశారు.
Note: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం నిపుణుల సూచనల మేరకే.. TV9 తెలుగు వీటిని ధృవీకరించడంలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత దీన్ని అనుసరించడం మంచిది.
Read Also.. Swimming Benefits: స్విమ్మింగ్ చేస్తే బరువు తగ్గుతారా ?.. ఈ టిప్స్ ఫాలో అయితే ఖాయమంటున్న నిపుణులు..