Eat Fruits: పండ్లు ఏ సమయంలో తింటే మంచిదో తెలుసా.. నిపుణులు ఏమంటున్నారంటే..
Right Time To Eat Fruits: పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో పండ్లను దాని జ్యూస్‌గా తయారు చేయడం వల్ల శరీరానికి మరింత శక్తి లభించి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
పండ్లు(Fruits) తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో పండ్లను దాని జ్యూస్‌గా తయారు చేయడం వల్ల శరీరానికి మరింత శక్తి లభించి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పండ్లు తీసుకోవడం వల్ల హీట్ స్ట్రోక్, హై బీపీ, క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలతో పోరాడడంలో సహాయపడుతుంది. పండ్లలో ఉండే పోషకాలు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు, కానీ వాటిని ఎప్పుడు తినాలో అనే విషయంపై ప్రజల మనస్సులలో గందరగోళం ఉంది. చాలా మంది పండ్లను తినడానికి మంచి, చెడు ఏంటని ప్రశ్నిస్తుంటారు. ఉదాహరణకు, ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తినడం మంచిదని కొందరు అంటారు, మరికొందరు ప్రతి భోజనానికి ముందు , ఆ తర్వాత పండ్లు తినాలని నమ్ముతారు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే.. నిజంగా పండ్లు తినడానికి తగిన సమయం ఉందా? ఎవరైనా పండ్లు తినకుండా ఉండాల్సిన సమయం ఏదైనా ఉందా? మీరు పండ్లను తినడానికి సమయం గురించి కూడా గందరగోళంగా ఉన్నట్లయితే.. పండ్లను తినడం వరకు బాగానే ఉంటుంది, కానీ వాటిని ఏ సమయంలో తినాలి ? ఎప్పుడు తింటే వాటి వల్ల మనకు లాభాలు కలుగుతాయి ? అనే విషయం చాలా మందికి తెలియదు. మరి ఇందుకు వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..!