Health News: అన్ని వయసుల పురుషుల కోసం సూపర్ డైట్ ఇదే.. కచ్చితంగా పాటించాల్సిందే..!
Health News: మనుషులు ఆరోగ్యంగా ఉండటంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఏది తిన్నా దాని ప్రభావం కొంత సమయం తర్వాత మన శరీరంపై కనిపిస్తుంది.
Health News: మనుషులు ఆరోగ్యంగా ఉండటంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఏది తిన్నా దాని ప్రభావం కొంత సమయం తర్వాత మన శరీరంపై కనిపిస్తుంది. అందుకే పురుషులు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన డైట్ ప్లాన్‌ను పాటించాలని వైద్యులు చెబుతున్నారు. పురుషులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇలా రకరకాల వారికి రకరకాల డైట్ ప్లాన్స్ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో అందరి డైట్ ఒకేలా ఉంటుంది. ఇక పురుషుల గురించి చెప్పాలంటే మహిళల కంటే వారికి ఎక్కువ కేలరీలు, ప్రోటీన్లు అవసరమని చెబుతారు. ఇది మాత్రమే కాదు పురుషులు మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలను సరైన మొత్తంలో తీసుకోవాలి. అటువంటి డైట్ ప్లాన్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.
కేలరీలు: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పురుషులు ఎక్కువ కేలరీలు తీసుకోవాలి. అయితే శరీరం వీటిని ఉపయోగించాలి. లేదంటే బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సగటు మనిషి రోజుకు 2000 నుంచి 2400 కేలరీలు తినాలని చెబుతారు.
ప్రొటీన్: కండరాల బలానికి ప్రొటీన్ కచ్చితంగా అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా మంది పురుషులు తమకు ఎక్కువ ప్రోటీన్ అవసరమని అనుకుంటారు. కానీ అది తప్పు. మనిషిలో రోజుకి 80 నుంచి 100 గ్రాముల ప్రొటీన్ సరిపోతుంది.
ఫైబర్: ఫైబర్ పెద్దప్రేగు క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. చిన్న పేగులోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. ఒక మనిషి రోజుకు దాదాపు 38 గ్రాముల పీచుపదార్థాన్ని తీసుకోవాలి. మహిళలు 25 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్: ఒమేగా-3 గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి ఆహారంలో భాగం కావాలి. పురుషులు అధిక బీపీ, అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్న వాటిని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో చేపలు, చియా విత్తనాలు ఉంటున్నాయి.
సోడియం, మినరల్స్: ఒక వ్యక్తి రోజుకు దాదాపు 2300 మిల్లీగ్రాముల సోడియం తినాలని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు రోజుకు 3400 మిల్లీగ్రాముల వరకు సోడియం తీసుకుంటున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పరిమిత పరిమాణంలో సోడియం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులకి దూరంగా ఉండవచ్చు. మరోవైపు ఖనిజాల గురించి మాట్లాడినట్లయితే పురుషులు తమ ఆహారంలో జింక్ ఉన్న వాటిని ఎక్కువగా తినాలి.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.