ECLGS: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ 5 లక్షల కోట్లకు పెంపు..!
ECLGS: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ ( ECLGS )ని రూ.5 లక్షల కోట్లకి విస్తరించింది. దీని కింద ట్రావెల్, టూరిజం, హోటల్,
ECLGS: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ ( ECLGS )ని రూ.5 లక్షల కోట్లకి విస్తరించింది. దీని కింద ట్రావెల్, టూరిజం, హోటల్, రెస్టారెంట్లకి సంబంధించిన చిన్న వ్యాపారుల నిర్వాహకులు లబ్ధిపొందుతారు. గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్‌లో ఈ పథకం వ్యవధిని మార్చి 2023 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా సవరణ ప్రకారం.. మార్చి 31, 2021 నుంచి జనవరి 31, 2022 మధ్య రుణం తీసుకున్న ECLGS 3.0 పరిధిలోకి వచ్చే కొత్త రుణగ్రహీతలు ఇప్పుడు అత్యవసర క్రెడిట్ సౌకర్యాన్ని పొందేందుకు అర్హులు. ECLGS అనేది MSME (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)ల కోసం ఒక ప్రత్యేక రుణ పథకం. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో MSME రంగానికి సహాయం చేయడానికి 13 మే 2020న ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ కింద దీన్ని అమలు చేశారు.
గతంలో ఈ స్కీమ్ గడువు 31 అక్టోబర్ 2020 వరకు రూ. 3 లక్షల కోట్ల రుణం కేటాయింపు వరకు మాత్రమే ఉండేది. ‘ECLGS 4.0’ పొడిగింపు కింద అనేక సార్లు ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, క్లినిక్‌లు, మెడికల్ కాలేజీలకు ఆన్-సైట్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇచ్చే 2 కోట్ల రూపాయల వరకు రుణాలపై 100% గ్యారెంటీ కవర్‌ని అందించారు.