ఉద్యోగులకి శుభవార్త.. రోజుకి 12 గంటల పని.. మూడు రోజులు సెలవులు..?

New Labor Code‌: దేశంలో కొత్త కార్మిక చట్టాన్ని ఏప్రిల్ 2022 నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఉద్యోగుల జీతం, సెలవులు,

ఉద్యోగులకి శుభవార్త.. రోజుకి 12 గంటల పని.. మూడు రోజులు సెలవులు..?
Employees
Follow us
uppula Raju

|

Updated on: Mar 31, 2022 | 9:03 AM

New Labor Code‌: దేశంలో కొత్త కార్మిక చట్టాన్ని ఏప్రిల్ 2022 నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఉద్యోగుల జీతం, సెలవులు, పని వేళలలో మార్పులు జరుగుతుంటాయి. అంటే వారంలో నాలుగు రోజులు పని, మూడు రోజులు సెలవులు ఉంటాయి. ఇందులో పని గంటలు ఎనిమిదికి బదులుగా 12 గంటలు ఉంటుంది. వారంలో కచ్చితంగా 48 గంటల పని నిబంధన వర్తిస్తుందని కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ఈ కార్మిక చట్టాలు 2021లో అమలులోకి వచ్చేవి. కానీ ఈ అంశం కేంద్రం, రాష్ట్రం రెండింటి పరిధిలో ఉంటుంది. అందుకే ఈ రెండు అమలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం చాలా రాష్ట్రాలు దీనిపై ముసాయిదా సిద్ధం చేస్తున్నాయి. అయితే 8 గంటలు పని చేసే చోట ఒక రోజు సెలవు ఇచ్చే సౌకర్యం కూడా ఇందులో ఉంది. ఈ చట్టాల కోసం కనీసం 13 రాష్ట్రాలు ముసాయిదా సిద్ధం చేశాయని సీనియర్ అధికారి ఒకరు సమాచారం ఇచ్చారు. కొత్త శ్రామిక శక్తిలో ఇటువంటి అనేక నిబంధనలు ఉన్నాయి. ఇది కార్యాలయాలలో పనిచేసే వేతన జీవుల నుంచి మిల్లులు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల వరకు ప్రభావితం చేస్తుంది.

జీతం తక్కువ PF ఎక్కువ

కొత్త చట్టంతో ఉద్యోగుల బేసిక్ శాలరీ (ప్రాథమిక), ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ల గణన విధానంలో పెద్ద మార్పు రానుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పీఎఫ్ ఖాతాలో ఉద్యోగుల కంట్రిబ్యూషన్ ప్రతినెలా పెరిగినా చేతిలో జీతం (టేక్ హోమ్ సాలరీ) తగ్గుతుంది. కొత్త లేబర్ కోడ్‌లో అలవెన్సులు 50 శాతానికి పరిమితం అవుతాయి. దీంతో ఉద్యోగుల మొత్తం జీతంలో 50 శాతం బేసిక్ జీతం అవుతుంది. ప్రాథమిక వేతనం, డియర్‌నెస్ అలవెన్స్‌తో కూడిన బేసిక్ పే శాతం ఆధారంగా PF లెక్కిస్తారు. ఈ పరిస్థితిలో ఒక ఉద్యోగి జీతం నెలకు 50 వేల రూపాయలు అయితే అతని బేసిక్‌ వేతనం 25 వేల రూపాయలు అవుతుంది. మిగిలిన 25 వేల రూపాయలలో అలవెన్సులు ఉంటాయి. బేసిక్ జీతంలో పెరుగుదల కారణంగా ఉద్యోగి తరపున చెల్లించే PF తగ్గుతుంది. సంస్థ సహకారం పెరుగుతుంది.

PAN-Aadhaar Link: గుర్తుందా.. ఇవాళే లాస్ట్ డేట్.. లింక్ చేస్తే రూ. 10 వేలు మిగిలినట్లే..

KTR: అక్కడ ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు ఆహ్వానం.. అర్సెలార్‌ మిత్తల్‌ సంస్థతో కేటీఆర్ చర్చలు

Petrol Diesel Price: అన్‌స్టాపబుల్‌.. ఇక తగ్గేదే లేదన్నట్టుగా పైపైకి.. మీ నగరంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!