Petrol Diesel Price: అన్‌స్టాపబుల్.. ఇక తగ్గేదే లేదన్నట్టుగా పైపైకి.. మీ నగరంలో పెట్రోలు, డీజిల్ ధరలు..
Petrol Price Today: అన్‌స్టాపబుల్..ఇక తగ్గేదే లేదన్నట్టుగా పైపైకి ఎగబాకుతున్నాయి పెట్రోల్ ధరలు. మరోసారి వాహనదారునికి షాకిచ్చాయి చమురు కంపెనీలు. పెట్రోలు, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.
Petrol Diesel Price Today: అన్‌స్టాపబుల్..ఇక తగ్గేదే లేదన్నట్టుగా పైపైకి ఎగబాకుతున్నాయి పెట్రోల్ ధరలు. మరోసారి వాహనదారునికి షాకిచ్చాయి చమురు కంపెనీలు. పెట్రోలు, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గురువారం మరోసారి లీటరుకు 80 పైసలు పెరిగింది. గత 10 రోజుల్లో 9వ సారి ధరలు పెంచారు. రికార్డు స్థాయిలో 137 రోజుల పాటు నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మార్చి 22న పెంచబడ్డాయి. ఆ తర్వాత తొమ్మిదోసారి ధరలు పెంచారు. ఇప్పటివరకు లీటరుకు రూ.6.40 చొప్పున మొత్తం పెంచారు. ప్రభుత్వ రంగ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలు విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంచాయి. లేటెస్ట్‌గా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 115 రూపాయల 42 పైసలు, లీటర్ డీజిల్ 101 రూపాయల 58 పైసలకు చేరింది. విజయవాడలో పెట్రోల్ ప్రైస్ 117 రూపాయల 32 పైసలకు, డీజిల్ ధర 103 రూపాయల 10 పైసలకు ఎకబాకింది.అయితే వాటి ధరలు స్థానిక పన్నులను బట్టి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది వరుసగా రెండో వారం. ఈ వివరాలను వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం పెట్రోర్, డీజిల్ ధరలు మీ కోసం..
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.42గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.101.58గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.69గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.100.82గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 114.60గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.77గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.63గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.81గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 114.52 ఉండగా.. డీజిల్ ధర రూ.100.71గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 114.02 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.23గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.116.39కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.09లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.115.42 ఉండగా.. డీజిల్ ధర రూ. 101.27గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.58 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.101.42గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 116.25గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.09గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.116.39లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.102.42లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.101.81 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 93.07 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.116.72కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.94 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.111.35 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 96.22 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 107.45 ఉండగా.. డీజిల్ ధర రూ.97.52గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.107.30 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.91.27గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.66 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.93.22గా ఉంది.
ఇవి కూడా చదవండి: Gold Coins: పొలంలో బంగారు నిధి.. మరో మహిళతో రవితేజ జంప్.. ఇదో గోల్డ్ కాయిన్ మిస్టరీ..
Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. కన్నడ భక్తుడిపై హోటల్ యజమాని దాడి.. ఘర్షణ..